Minion stuffed toys from 'Despicable Me' ensure social distancing between movie fans in Paris theatre

తెరుచుకున్న థియేటర్లు.. సీట్ల మధ్యలో మినియన్స్ బొమ్మలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఫ్రాన్స్‌లో సినిమా థియేటర్లను బార్లా తెరిచేశారు. కరోనా సోకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా భయంతోను..లాక్ డౌన్ నిబంధనలతోను ఇంటికే పరిమితమైపోయిన ప్రజలకు ఎంటర్ టైన్ మెంట్ లేకుండా పోయింది. ఇళ్లల్లోనే కూర్చునీ కూర్చునీ బోర్ కొట్టేసింది. థియేటర్లు తెరుచుకోవటంతో ప్రేక్షకులు కూడా పెద్దసంఖ్యలో వచ్చేస్తున్నారు. ఏ సినిమా అయినా రెండు గంటల కంటే ఎక్కువేం ఉండదుగా..బస్సుల్లోనూ, రైళ్లలోనూ గంటలపాటు ప్రయాణిస్తున్నాం కదా.. ఏం కాదులే అనుకుంటున్నారు. అలా అని తమకు తామే సర్ధి చెప్పుకుంటూ వారికి వారే భరోసా ఇచ్చేసుకుంటూ..ఎంటర్ టైన్ మెంట్ ప్లేసులకు వచ్చేస్తున్నారు. 

కాగా..థియేటర్లు కూడా టికెట్లపై డిస్కౌంట్లు, ఆకట్టుకునే ఆఫర్లు ఇచ్చేస్తున్నారు. థియేటర్ యజమానులు కరోనా నిబంధనలు పాటిస్తూ..హాళ్లలో భౌతిక దూరం కోసం సీట్ల మధ్య మినియన్స్(కామెడీ బొమ్మ)లను కూర్చోబెడుతున్నారు. 

దాదాపు సగం సీట్లను బొమ్మలతోనే నింపేశారు. అంటే 50శాతం బొమ్మలు..మిగతా 50 శాతం ప్రేక్షకుల కోసం ఏర్పాటు చేశారు. ఫ్యామిలీలతో వచ్చినవారికి.. జంటలుగా వచ్చిన వారు కూర్చోడానికి వీలుగా కొన్ని చోట్ల రెండు మూడు సీట్లను వరుసగా ఖాళీగా వదిలేసి తర్వాత బొమ్మలు పెట్టారు. 

దీనికి సంబంధించిన  ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తమ థియేటర్లలో బొమ్మలు, శానిటైజర్లు, స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తూ పక్కడ్బందీగా వ్యవహరిస్తున్నామని పారిస్ నగరంలోని ఎంకేటూ థియేటర్ యాజమాన్యం ప్రకటించింది. ఏమాత్రం భయపడకుండా రావచ్చంటూ భరోసానిస్తోంది.  

కాగా..కరోనా భయంతో ఎంతకాలమని ఇంటిలోనే ఉండిపోతాం..అనుకుంటున్న ప్రజలు లాక్ డౌన్ నిబంధనల్ని కూడా ఏమాత్రం పట్టించుకోవట్లేదు. వేరే దారిలేక ఎవరి పనులు వాళ్లు చూసుకుంటున్నారు. ఇది ఒక్క భారతదేశంలోనే కాదు దాదాపుఅన్ని దేశాల్లోనే కరోనా అంటే ప్రజల్లో భయం పోయినట్లుగా ఉంది. 

దాదాపు అన్ని దేశాల్లోనూ లాక్‌డౌన్ ప్రభావం తగ్గుతోంది. ఇప్పుడంతా మాస్కులు, శానిటైర్లు సర్వసాధారణంగా మారిపోయాయి. ఒంటిపై బట్టలు వేసుకోవటం ఎంత సాధారణమో అవికూడా అంతే సాధారణంగా మారిపోయాయి,
బస్సులు, రైళ్లు, విమానాలు తెగ తిరిగేస్తున్నాయి. ఈక్రమంలో ఫ్రాన్స్ లో థియేటర్లు ఓపెన్ కావటంతో ప్రేక్షకుల నుంచి కూడా మంచి  స్పందన రావటంతో థియేటర్ల్ యజమానులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. 
 

Related Posts