కరోనా చికిత్సకు రూ.10 వేలు మించదు… రోజుకు రూ.2 లక్షల బిల్లులు దారుణం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా చికిత్సకు రూ.10 వేలు మించదు… రోజుకు రూ.2 లక్షల బిల్లులు దారుణమన్నారు మంత్రి ఈటెల రాజేందర్. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ చికిత్స కోసం ఖరీదైన మందులను వినియోగిస్తున్నట్లు చెప్పారు. తొలిదశలోనే కరోనా వైరస్ ను గుర్తిస్తే..చికిత్స ఖరీదైనది కాదని, ఆక్సిజన్, మందులన్న కలిపితే..రూ. 10 వేలకు మించదన్నారు. ప్రైవేటులో రోజుకు లక్ష, రెండు లక్షలు వసూలు చేయడం దారుణమన్నారు.అంత ఖర్చయ్యే చికిత్స అసలు లేదని స్పష్టం చేశారు. లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారంటూ..ప్రైవేటు ఆసుపత్రుల మీద ఫిర్యాదులు రావడంతో విచారణ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ (టిమ్స్‌) హాస్పిటల్ ను మంత్రి ఈటెల సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…టిమ్స్ లో పనిచేస్తున్న డాక్టర్లు మరింత ఉత్సాహంగా పనిచేయాలన్నారు. 24 గంటలు అందుబాటులో ఉండాలన్నారు. డ్డగోలుగా ఫీజులు వసూలుచేసే దవాఖానలపై చర్యలు తప్పవని హెచ్చరించారు.రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో కొవిడ్‌ రోగుల కోసం కావాల్సివన్నీ పడకలు అందుబాటులో ఉన్నాయని, మంచి సదుపాయాలు కల్పిస్తున్నామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఈటెల సూచించారు.

Related Posts