లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Telangana

దుబ్బాక బస్టాండుకు రా, బండి సంజయ్ కు మంత్రి హరీష్ సవాల్

Published

on

Minister Harish Rao challenges To Bandi Sanjay : దుబ్బాక బస్టాండు వద్దకు రండి, ప్రజల మధ్య మాట్లాడుదాం, బీడీ కార్మికులకు మోడీ ప్రభుత్వం రూ. 1600 ఇచ్చేది వాస్తవం అయితే…వివరాలు తీసుకుని రా…రాష్ట్ర ఆర్థిక మంత్రిగా..చెబుతున్నా..16 పైసలు ఇవ్వలే…వారు చెబుతున్నది వాస్తవం అయితే..అక్కడే ఆర్థిక మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తా..నిరూపించలేకపోతే..బస్టాండు వద్ద ముక్కు నేలకు రాసి, ఎంపీ, బీజేపీ అధ్యక్ష పదవులకు రాజీనామా చేస్తారా ? అంటూ మంత్రి హరీష్ రావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు సవాల్ విసిరారు.ఇంత నీచస్థాయి ప్రచారానికి దిగుతారా, ప్రజలను మభ్య పెట్టేలా బీజేపీ నేతలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారంటూ తీవ్రంగా మండిపడ్డారాయన. దుబ్బాకలో జరగని వాటిని జరిగినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని చెప్పారు.కొద్ది రోజుల్లో దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా 2020, అక్టోబర్ 19వ తేదీ సోమవారం సిద్ధిపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని మంత్రి హరీష్ రావు ఎండగట్టారు.7, 53, 927 కేసీఆర్ కిట్ లు రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రభుత్వం ఇచ్చిందని తెలిపారు. ఒక్క పైసా కూడా కేంద్రం ఇవ్వలేదు..ఇందులో తాము డబ్బులు ఇచ్చామంటున్నారని విమర్శించారు. నోటికి ఏది వస్తే..అలా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని, ఇంతకంటే ఉదాహరణలు ఏమీ కావాలంటూ.. బీజేపీ ప్రచురించిన కరపత్రాన్ని చూపించారాయన. హుజూర్ నగర్ లో కూడా ఇదే విషయాన్ని చెప్పారని, కానీ ప్రజలు ఎలాంటి తీర్పునిచ్చిందో గుర్తు పెట్టుకోవాలన్నారు.దీనికంటే..ముందు..బీజేపీ నేతలు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టింగ్ లు పెడుతున్నారో మీడియాకు మంత్రి హరీష్ రావు వివరించారు. టీఆర్ఎస్ పార్టీ గద్దెను కూల్చివేసినట్లుగా, ప్రజలు తిరగబడుతున్నట్లుగా శ్రీనివాస్ లౌడ్య ప్రచారం చేశారని, దీనిపై తమ పార్టీకి చెందిన వారు..పోలీసులకు కంప్లట్ చేశారని తెలిపారు. దుబ్బాకలో టీఆర్ఎస్ గద్దె కూలిందా అంటూ సూటిగా ప్రశ్నించారు.2018 కల్వకుర్తిలో ఎన్నికల సమయంలో మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన విషయాన్ని తీసుకొచ్చి ఇక్కడ జరుగుతుందని బీజేపీ ప్రచారం చేయడం తగునా ? సూటిగా ప్రశ్నించారాయన. బీజేపీ గోబెల్స్ ప్రచారం చేస్తోందని విమర్శించారు. దుబ్బాకలో జరగని వాటిని జరిగినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారన్నారు.2016-17లో ముఖ్యమంత్రి హామీల అమలు కోసం ఏర్పాటు చేసిన ఎస్డీఎఫ్ ఫండ్ కింద..దుబ్బాక పట్టణంలో రూ. 3 కోట్ల నిధులతో టౌన్ హాల్ నిర్మాణానికి నిధులు కేటాయించి…పునాదులు తీయకుండానే పురపాలక సంఘ కమిషనర్, కాంట్రాక్టర్ కు పైసలు ఇచ్చాడు..అంటూ మరో బీజేపీ నేత సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని తెలిపారు.వాస్తవానికి ఒక్క పైసా నిధులు విడుదల కాలేదని, మూడు కోట్లు డ్రా అయినా..చూపిస్తారా ? మూడు రూపాయల బిల్లు ఇచ్చిండా ? ఎంబీ రికార్డు కాకుండా..కమిషనర్ ఇచ్చేస్తారని ఎలా ప్రచారం చేస్తారని ప్రశ్నించారు.
ఆర్టీఐ కింద..రఘునందన్ రావు చేసిన దరఖాస్తు ప్రకారం..సిద్ధిపేట జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ ఇచ్చిన సమాచారంలో బయటపడిన పచ్చి నిజాలు అంటూ నిహాల్ గౌడ్ పల్లె పోస్టు చేశారని తెలిపారు.2019-20లో ముఖ్యమంత్రి హామీల అమలు కోసం చేసిన ఎస్డీఎఫ్ ఫండ్ కింద దుబ్బాక పట్టణం చేర్వాపూర్ మారెమ్మ దేవాలయం నుంచి దుంపలపల్లి గ్రామం వరకు కోటి రూపాయల డాంబర్ రోడ్డుకు నిధులు మంజూరు చేశారు..డబ్బా డాంబర్, తట్టా కంకర వేయకుండనే పురపాలక సంఘ కమిషనర్, కాంట్రాక్టర్ కు రూ. కోటి ఇచ్చిండు అని పోస్టులో వెల్లడించారని విమర్శించారు.వాస్తవానికి ఇంకా కాంట్రాక్టర్, టెండర్ ఫైనల్ కాలేదని వాస్తవ విషయాలు చెప్పారు మంత్రి హరీష్ రావు. ఇంత దివాళ కోరుతనమైన రాజకీయం ఉంటుందా ? ఇంత పచ్చి అబ్దాలు చెబుతారా అంటూ మండిపడ్డారు.
కరీంనగర్ కార్పొరేటర్, బీజేపీ మహిళా నాయకురాలు దుబ్బాకకు వచ్చి..బీడీ నాయకులతో మాట్లారని, పెన్షన్ లో రూ. 2 వేలలో రూ. 1600 మోడీ ఇస్తున్నారని చెప్పారని తెలిపారు.బీడీ కార్మికులకు మోడీ ప్రభుత్వం ఇస్తున్నది వాస్తవమైతే..గుజరాత్ లో బీడీ కార్మికులకు ఒక్క రూపాయి పెన్షన్ ఇస్తున్నారా ? అంటూ ప్రశ్నించారు. అక్కడ వృద్ధాప్య ఫించన్ కేవలం రూ. 500 ఇస్తున్నారని విషయాన్ని గుర్తు చేశారు. అబద్దాల పునాదులపై రాజకీయాలు చేస్తున్నారని, ప్రజలు గెలిపిస్తే గెలవాలి కానీ..అనారోగ్య ధోరణి ప్రజాసామ్యానికి మంచిది కాదని బీజేపీ నేతలకు సూచించారు. దుబ్బాక ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మంత్రి హరీష్ రావు తెలిపారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *