Home » ఎమ్మెల్యే క్రాంతిపై దాడిని ఖండించిన మంత్రి హరీష్ రావు…టీఆర్ఎస్ కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే బీజేపీ నేతలు దాడి
Published
3 months agoon
By
bheemrajBJP leaders attack : టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతిపై దాడిని ఖండిస్తున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. బీజేపీ నేతల దాడి హేయమైన చర్యగా అభివర్ణించారు. ఎమ్మెల్యేపై ఉద్దేశపూర్వకంగా, పథకం ప్రకారం దాడి చేశారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ కు ప్రజల నుంచి వస్తోన్న ఆదరణ చూసి ఓర్వలేకే బీజేపీ నేతలు దాడులు చేస్తున్నారని తెలిపారు.
భౌతిక దాడులు బీజేపీ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. బీజేపీ నేతలు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని పేర్కొన్నారు. జితేందర్ రెడ్డి రామాయంపేటలో ఉంటే తప్పులేనిది క్రాంతి సిద్ధిపేటలో ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. దాడికి ముందే పోలీసులు తనిఖీలు చేశారని..తనిఖీల్లో ఎలాంటి ప్రచార సామాగ్రి లేదన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు.
(నవంబర్ 2, 2020) సోమవారం సిద్దిపేటలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్ వద్ద బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఆందోల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు.
ఎమ్మెల్యే బస చేస్తున్న గదిలోకి బీజేపీ కార్యకర్తలు చొచ్చుకెళ్లి దాడి చేశారు. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ, తోపులాట జరిగింది. దీంతో పలువురు టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలకు గాయాలు అయ్యాయి.
ఎమ్మెల్యే బస చేస్తున్న హోటల్లోకి బీజేపీ కార్యకర్తలు దూసుకెళ్లి దాడి చేశారు. ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ దాడిని ప్రతిఘటించారు. బీజేపీ కార్యకర్తల దాడిని టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అడ్డుకున్నారు. పలువురు టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. అయితే బీజేపీ కార్యకర్తలు మందు తాగి వచ్చి దాడికి దిగారని టీఆర్ఎస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.