లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

బాబు..ఒళ్లు దగ్గర పెట్టుకో – కొడాలి నాని హెచ్చరిక

Published

on

Minister Kodali Nani Strong Warning : సీఎం జగన్ గురించి అవాకులు, చెవాకులు పేలినా..తగిన శాస్తి చెబుతామని, ఒళ్లు దగ్గర పెట్టుకోవాలంటూ మంత్రి కొడాలి నాని హెచ్చరించారు. 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి..సుప్రీం, హైకోర్టుల్లో కేసులు వేసి..గంటకు కోట్ల రూపాయలు తీసుకొనే లాయర్లు పెట్టి…పేదలకు ఇళ్లు రిజిస్ట్రేషన్ చేయించొద్దని..స్టే తీసుకరావాలనే అవసరం బాబుకు మాత్రమే ఉందని..వేరే వారికి అవసరం లేదన్నారు.వెంటనే కేసులను డిసెంబర్ 21వ తేదీలోపున విత్ డ్రా చేసుకోవాలని సూచించారు. పెద్ద మనస్సుతో ముందుకు రావాలని సూచించారు. దీనిపై అవసరమైతే..తాను స్వయంగా ఆందోళన చేపడుతానని తెలిపారు. 2020, నవంబర్ 11వ తేదీ బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.


మిస్ టీన్ తెలుగు యూనివర్స్ కిరీటం దక్కించుకున్న నిత్యా కొడాలి


పేదలు, బడుగు, బలహీన వర్గాల కోసం సీఎం జగన్ పని చేస్తున్నారని, 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు సీఎం జగన్ ప్రభుత్వం ఇస్తుందని, 70 సంవత్సరాల్లో నాలుగు మంచి పనులు చేయాలని బాబుకు హితవు పలికారు. గతంలో మతం మారిపోయాడంటూ..బాబు అసత్యప్రచారం చేశారని విమర్శించారు. క్రిస్టియన్ కాబట్టి..హిందు దేవాలయాలపై దాడులు చేస్తున్నారంటూ విమర్శలు చేయడం కరెక్టు కాదన్నారు. ఎన్ని డ్రామాలు ఆడినా..హైదరాబాద్ లో కూర్చొని జూమ్ యాప్ లో ఎంత మాట్లాడినా ఉఫయోగం లేదన్నారు. మతాలు, కులాలు ఎంత తక్కువగా మాట్లాడితే..అంత మంచిందన్నారు.అధికారం, పదవుల కోసం కులాలను, మతాలు అడ్డు పెట్టుకోవడం జగన్ కు అలవాటు లేదని, వెన్నుపొటు పొడిచో..అడ్డదారిలో అధికారంలోకి రాలేదన్నారు. ప్రజలను నమ్మాడు..ప్రజల మధ్య పార్టీ స్థాపించాడని, ప్రజల మధ్య తిరిగాడన్నారు. మేనిఫెస్టోలో వెల్లడించిన ప్రకారం..సంక్షేమ పథకాలు అమలు చేస్తూ చిత్తశుద్ధితో జగన్ పనిచేస్తున్నారన్నారు. రాజశేఖరరెడ్డి పాలన తీసుకరావాలని, ఆయన చూపించిన దారిలో నడుస్తూ..ప్రజల మన్ననలు పొందుతున్నారన్నారు మంత్రి కొడాలి నాని.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *