లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

చంద్రబాబు ఫేక్ ప్రతిపక్ష నేత : మంత్రి కొడాలి నాని

Published

on

Kodali Nani sensational comments : టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఫేక్ ప్రతిపక్ష నేత అని వ్యాఖ్యానించారు. అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకునే రకం అని విమర్శించారు. ఎవరు కనపడితే వారితో పొత్తు పెట్టుకుంటారని ఆరోపించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో నాని ఈ వ్యాఖ్యలు చేశారు.బాబు టికెట్లు ఇచ్చినా ఈసారి ఎవరూ గెలవరని పేర్కొన్నారు. చంద్రబాబు చంద్రగిరి వదిలి కుప్పం పారిపోయారని ఎద్దేవా చేశారు. ఆల్మట్టి, బాబ్రీ ప్రాజెక్టులు కడుతుంటే పారిపోయారని విమర్శించారు. వైఎస్ఆర్, జగన్ రక్తంలో పారిపోయే లక్షణ లేదన్నారు. చేసిన తప్పులను చంద్రబాబు సరిదిద్దుకోవాలన్నారు.చంద్రబాబు హయాంలో పెన్షన్లకు నెలకు రూ.490 కోట్లు ఇచ్చారని పేర్కొన్నారు. ఇప్పుడు రూ.1500 కోట్లు ఇస్తున్నామని తెలిపారు. చంద్రబాబు మెప్పు కోసం తమపై ఆరోపణలు చేయకండని టీడీపీ సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు.చంద్రబాబు 9 ఏళ్ల పాలనలో ఒక్క పెన్షన్ కూడా పెంచలేదని విమర్శించారు. రూ.200 పెన్షన్ గతంలో వైఎస్ ఆర్ పెట్టినదేనని చెప్పారు. 74 లక్షల పెన్షన్లు ఇచ్చిన ఘనత వైఎస్ఆర్ దేనని అన్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *