మోడీ స్లోగన్‌తోనే జనంలోకి.. మాది గల్లీ పార్టీ, మజ్లీస్‌తో పొత్తు లేదు: KTR

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Minister Ktr Comments On Alliance with MIM:ఆరేళ్లుగా రాష్ట్రంలో ఎక్క‌డా కూడా గిల్లి క‌జ్జాలు, పంచాయితీలు లేవని, ప‌క్కా ప్రణాళిక‌తో న‌గ‌రం అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు కేటీఆర్. న‌గ‌ర ప్ర‌జ‌ల ప్రాధాన్యాలు, ప్రాథ‌మిక అవ‌స‌రాలు గుర్తించి ప‌ని చేసినట్లుగా స్పష్టం చేశారు. ఆరున్నరేళ్ల క్రితం నగరంలో నగరంలో పరిస్థితి బాగోలేదని, ఇప్పుడు ప‌రిస్థితి అంతా ప్ర‌శాంతంగా ఉందని, అన్ని కోణాల్లో ప్ర‌గ‌తి ప‌థంలో ఉన్నట్లుగా చెప్పారు.భార‌త‌దేశం మ‌న‌వైపు చూస్తుంద‌న‌డానికి కార‌ణం కేసీఆర్ మాత్ర‌మేనని అన్నారు. ఎక్క‌డా కూడా గిల్లి క‌జ్జాలు, పంచాయితీల‌కు తావు లేకుండా సాగుతుందని అన్నారు. ఆరేళ్లుగా నగరంలో లొల్లి అనేదే లేదని స్పష్టం చేశారు కేటీఆర్. ‘ఓకల్ ఫర్ లోకల్..’ అని ప్రధాని మోడీ చెప్పిన స్లోగన్‌తోనే జనాల్లోకి వెళ్లనున్నట్లు కేటీఆర్ చెప్పుకొచ్చారు. మేం గల్లీ పార్టీ, వాళ్లది ఢిల్లీ పార్టీ అని, వాళ్లొచ్చి మనపై పెత్తనం చేస్తారా? అని ప్రశ్నించారు.

అబద్ధమైతే మమ్మల్ని శిక్షించండి.. నిజమైతే ఆశీర్వదించండి

ఇదే సమయంలో ఎన్నిక‌ల తర్వాత మ‌జ్లిస్ పార్టీకి మేయ‌ర్ ప‌ద‌వి ఇస్తార‌నేది పిచ్చి ప్ర‌చారం అని కేటీఆర్ తేల్చిచెప్పారు. గ‌త గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో కంటే ఇప్పుడు మెరుగైన సీట్లు సాధిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఎంఐఎంతో ఎలాంటి పొత్తు ఉండ‌దు. గ‌త ఎన్నిక‌ల్లో ఐదు మ‌జ్లిస్ స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. డిసెంబ‌ర్ 4 త‌ర్వాత టీఆర్ఎస్ మ‌హిళా అభ్య‌ర్థే మేయ‌ర్ అవుతారని, అందులో అనుమానం అక్క‌ర్లేద‌ని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

Related Tags :

Related Posts :