లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story

సర్జికల్ స్ట్రైక్ శత్రుదేశాల మీద చేస్తారు..కానీ హైదరాబాద్ మీద చేస్తారా..? అమిత్ షా కామెంట్స్ పై కేటీఆర్ ఫైర్

Published

on

KTR Fire Amit Shah comments : కేంద్ర హోంమంత్రి అమిత్ షా కామెంట్స్ పై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. సర్జికల్ స్ట్రైక్ శత్రుదేశాల మీద చేస్తారు..కానీ హైదరాబాద్ మీద చేస్తారా..? అని ప్రశ్నించారు. హిందూ, ముస్లిం పేరుతో విడదీసే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు.ఓట్ల కోసం చిచ్చు పెడుతున్నారు..ఆగం కాకండి.. అన్నారు. పిచ్చొళ్ల చేతిలో హైదరాబాద్ ను పెట్టకండి అని తెలిపారు. ఇద్దరు మత పిచ్చొళ్లను తరిమికొట్టండి అని పిలుపునిచ్చారు. ఆదివారం సనత్ నగర్ లో తనిర్వహించిన రోడ్ షోలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.హైదరాబాద్ చాలా ప్రశాంతంగా ఉందని చెప్పారు. పేకాట క్లబ్బు లేదు… గుడుంబా గబ్బు లేదన్నారు. సర్జికల్ స్ట్రైక్ శత్రుదేశాల మీద చేస్తారు..కానీ హైదరాబాద్ మీద చేస్తారా..? అని పేర్కొన్నారు. మీ మెదడు మోకాళ్లలో ఏమైనా ఉందా అని ఘాటుగా వ్యాఖ్యానించారు. విషయం లేదు కాబట్టి..విషం చిమ్మిపోతంటే నడవదన్నారు.ఆరేళ్లలో ఎన్ డీఏ ప్రభుత్వం తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆరేళ్లలో కేంద్రం ఏం ఇచ్చిందనే విషయంపై పక్కాగా లెక్కలున్నాయని తెలిపారు. రూ.2.72 లక్షల కోట్లు కేంద్రానికి కట్టాం.. అందులో 1.40 లక్షల కోట్లు మాత్రమే తెలంగాణకు వచ్చాయని తెలిపారు. జన్ ధన్ ఖాతాల్లోకి రూ.15 లక్షలు ఎంతమందికి ఇచ్చారని ప్రశ్నించారు.మార్కెట్ లో కొత్త కొత్త కార్టూన్లు వచ్చాయని తెలిపారు. ఇన్స్యూరెన్స్ ఏజెంట్ వా లేదా ప్రజా ప్రతినిధివా? అన్నారు. ఐటీఐఆర్ రద్దు చేసినోళ్లు హైదరాబాద్ ఐటీ హబ్ గా చేస్తారా అని ప్రశ్నించారు. జంగల్ రాజ్ నుంచి వచ్చిన యూపీ సీఎం మారు చెబుతారా? రండి, ఇరానీ చాయ్ తాగండి..బిర్యానీ తిని పొండి… ఉచిత సలహా ఇచ్చారు.ఐటీ హబ్ తెచ్చింది ఎవరు? పెద్ద కంపెనీలు తెచ్చింది ఎవరని ప్రశ్నించారు. ఎవరు ఏం చేస్తారో తెలుసుకోండి.. సోచో ఇండియా సోచో అన్నారు. బీపాస్ కావాలా? కర్ఫ్యూ పాస్ కావాలా అని నగర ప్రజలనుద్దేశించి మాట్లాడారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *