లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Telangana

ఓట్ల కోసం పచ్చగా ఉన్న హైదరాబాద్ లో చిచ్చుపెడతారా?… బండి సంజయ్ పై మంత్రి కేటీఆర్ ఫైర్

Published

on

Minister KTR fires Bundi Sanjay’s comments : పాతబస్తీ ఓటర్లపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేస్తామనడాన్ని తప్పుబట్టారు. నాలుగు ఓట్ల కోసం దిగజారి, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయాలా వెళ్లి కాళ్లు పట్టుకుంటే ఓట్లు వేస్తారు కదా? అన్నారు.కొన్ని ఓట్లు, సీట్ల కోసం మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పచ్చగా ఉన్న హైదరాబాద్ లో చిచ్చుపెడతారా? హైదరాబాద్ తల్లడిల్లాలి.. నాలుగు ఓట్లు, సీట్లు రావాలన్నదే బీజేపీ ఆలోచన అన్నారు.బీజేపీ అభ్యర్ధి మేయర్ అయిన తర్వాత పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తాం అంటూ కాంట్రవర్శియల్ కామెంట్లు చేశారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. రామాంతపూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన సంజయ్.. టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ ప్రచారంలో ఆవేశంగా స్పీచ్ ఇచ్చిన సంజయ్.. బీజేపీ అభ్యర్థి మేయర్ అయిన తర్వాత రోహింగ్యాలను ఏరివేస్తాం అని అన్నారు.భాగ్యలక్ష్మీ ఆలయం పాకిస్తాన్‌లో ఉందా? అని ప్రశ్నించారు. రోహింగ్యాలు లేని ఎన్నికలు జరగాలని అది బీజేపీ వల్లే సాధ్యం అవుతుందని అన్నారు. రోహింగ్యాల ఓటర్లు లేని ఎన్నికలు, పాకిస్తాన్ ఓటర్లు లేని ఎన్నికలు హైదరాబాద్‌లో జరగాలని అన్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *