నిర్మాణ రంగానికి ప్రభుత్వం అండగా ఉంటుంది : కేటీఆర్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

నిర్మాణ రంగ సంఘాలతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. బల్డింగ్, లేఅవుట్ల అనుమతులకు సంబంధించిన పలు అంశాలను నిర్మాణ రంగ ప్రతినిధులు కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. ఇసుక సరఫరా సమస్యలపై టీఎస్ ఎండీసీతో కేటీఆర్ మాట్లాడారు. నిర్మాణ రంగానికి ప్రభుత్వం అండగా ఉంటుందని కేటీఆర్ అన్నారు. నిర్మాణ సైట్ల వద్ద పని చేస్తున్న కార్మికులు వివరాలు నమోదు చేయాలని అన్నారు. సిమెంట్ ధరల పెరుగుదలపైనా కంపెనీతో చర్చిస్తామని కేటీఆర్ చెప్పారు.

నిర్మాణ రంగానికి సంబంధించి రాష్ట్రంలో పురోగతి దిశలో నడిపించాలనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉన్నట్లు కొద్దిసేపటి క్రితం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఆ సంస్థ ప్రతినిధులతో మాట్లాడిన కేటీఆర్..పలు అంశాలపై చర్చించారు. నిర్మాణ రంగంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు తదితర వివరాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. నిర్మాణ రంగానికి ప్రోత్సాహం ఇచ్చే విధంగానే ప్రభుత్వ చర్యలుంటాయన్న స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

కరోనా లాక్ డౌన్ కారణంగా నిర్మాణ రంగానికి స్తబ్ధత ఉన్నా.. తిరిగి గాడిన పెట్టేందుకు తీసుకోవాల్సిన అన్ని చర్యలు, ప్రోత్సహకాలను పూర్తిస్థాయిలో అందిస్తామని చెప్పారు. నిర్మాణ రంగానికి ప్రధానంగా ఇసుక, సిమెంట్ అవసరాలు ఉంటాయి. కాబట్టి సిమెంట్ ధరలు తగ్గించేందుకు ప్రతినిధులతో చర్చలు ముగిశాయి. మరోసారి చర్చలు జరిపి నిర్మాణ రంగానికి అనుకూలంగా సిమెంట్ ధరలు తగ్గించే విధంగా చర్యలు చేపడతామని కేటీఆర్ హామీ ఇచ్చారు.

ఇందుకు సంబంధించి త్వరలో ఓ నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. నిర్మాణ రంగానికి అవసరయ్యే ఇసుక తరలించేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు.

Related Posts