లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Telangana

‘ఎవరో పిచ్చోళ్లు చేసిన వ్యాఖ్యలను మేం పట్టించుకోం’ : బండి సంజయ్ వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్

Published

on

KTR-respond

KTR respond Bandi Sanjay’s comments : జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ కామెంట్స్ తో పొలిటికల్ హీట్ పెరిగింది. ఆయన కామెంట్స్ పై టీఆర్ఎస్ సీరియస్ అయింది. బీజేపీ నేతలు భ్రమల్లో ఉన్నారని గులాబీ నేతలు పేర్కొన్నారు. కూలదోసే రాజకీయాలు బీజేపీకి అలవాటే అంటూ కౌంటర్ ఇచ్చారు.బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఆయన వ్యాఖ్యలను కేటీఆర్ కొట్టిపారేశారు. ఎవరో పిచ్చోళ్లు చేసిన వ్యాఖ్యలను మేం పట్టించుకోబోమన్నారు. ఓటమి భయంతో బీజేపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని కవిత మండిపడ్డారు.టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని ఎందరో అనుకున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రజలు అండగా ఉన్నారని తెలిపారు. బండి సంజయ్ వ్యాఖ్యలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. గ్రేటర్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు.బండి సంజయ్ వి బ్లాక్ మెయిల్ రాజకీయాలని మండలి చీఫ్ గాదర కిషోర్ అన్నారు. బీజేపీ వి కూలదోసే రాజకీయాలని విమర్శించారు. తెలంగాణ ప్రజలు బీజేపీని నమ్మరని పేర్కొన్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *