లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Telangana

హైదరాబాద్‌లో వ్యాక్సిన్ టెస్టింగ్, సర్టిఫికేషన్ లేబోరేటరీ పెట్టండి

Published

on

KTR wrote a letter to Union Minister : హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో వ్యాక్సిన్ టెస్టింగ్, సర్టిఫికేషన్ లేబోరేటరీని ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హ‌ర్షవ‌ర్ధన్‌కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. హైదరాబాద్ ప్రపంచానికే వ్యాక్సిన్ రాజధానిగా ఉంద‌న్నారు కేటీఆర్. ఏటా ఆరు బిలియన్ల డోసుల వ్యాక్సిన్లను ఇక్కడి బయోటెక్ కంపెనీలు తయారు చేస్తున్నట్లు తెలిపారు.

ప్రపంచం మొత్తంలోని వ్యాక్సిన్లలో మూడొంతుల వ్యాక్సిన్లు హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలోనే తయారవుతున్నాయన్నారు. అందువల్లే.. ప్రధాని మోడీ సహా 85 దేశాలకు చెందిన రాయబారులు జీనోమ్ వ్యాలీని సందర్శించి కోవిడ్ వ్యాక్సిన్ తయారీపై వివరాలు అడిగి తెలుసుకున్నారన్నారు.

ప్రస్తుతం కోల్‌క‌తా, ముంబై, చెన్నై, కర్నాల్‌లో మాత్రమే ఉన్న ప్రభుత్వ మెడికల్ స్టోర్ డిపోను.. హైదరాబాద్‌ జినోమ్ వ్యాలీలో ఏర్పాటు చేయాలని కేటీఆర్ తన లేఖలో కోరారు.