లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

జగన్‌పై ప్రజలకు అమాంతం నమ్మకం పెరిగింది, నిదర్శనం ఇదే

Published

on

minister peddireddy comments on cm jagan: సీఎం జగన్ పై ప్రజలకు నమ్మకం బాగా పెరిగిందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. జగన్ చేసిన అభివృద్ధిని చూసి గ్రామీణ ఓటర్లు వైసీపీకి ఓటు వేశారని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం వల్ల జగన్ పై ప్రజలకు నమ్మకం అమాంతం పెరిగిందని ఆయన వివరించారు.

పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి కేవలం 15.75 శాతం స్థానాలు మాత్రమే వచ్చాయని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. 50 శాతం స్థానాలను కైవసం చేసుకున్నట్టు టీడీపీ అధినేత చంద్రబాబు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలు నాలుగు విడతలలో జరగ్గా… అన్ని విడతలలో వైసీపీకి మెజార్టీ వచ్చిందని చెప్పారు.

కుప్పంలో టీడీపీ దౌర్జన్యాలకు పాల్పడిందని… అయినా, వైసీపీ గెలుపును అడ్డుకోలేకపోయిందని అన్నారు. పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగి ఉంటే వైసీపీ ఓట్ల శాతం మరింత పెరిగేదని మంత్రి చెప్పారు.

పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో కూడా వస్తాయని పెద్దిరెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పటికంటే ఎక్కువ మెజార్టీని సాధించడానికి కృషి చేస్తామన్నారు. జగన్ ప్రతిరోజు నిబద్ధతతో శాఖల సమీక్షలను నిర్వహిస్తున్నారని అన్నారు. జాతీయ స్థాయిలో జగన్ కు చాలా మంచి పేరు ఉందని చెప్పారు. రోజుకు 18 గంటలు పని చేసినట్టు చంద్రబాబు చెప్పేవారని… ఎక్కడ, ఎప్పుడు, ఏం పని చేశారో కూడా ఎవరికీ తెలియదని ఎద్దేవా చేశారు.

పంచాయతీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించారంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని సీఎం జగన్ అభినందించారు. అత్యధిక స్థానాల్లో వైసీపీ మద్దతుదారులు గెలిచేలా కృషి చేశారంటూ ప్రశంసించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కు మంత్రి పెద్దిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల హామీలు నెరవేర్చడం, సీఎం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడమే విజయానికి కారణాలు అని పెద్దిరెడ్డి వివరించారు.

మంత్రి పెద్దిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… ఏపీలో 13,095 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా 10,524 పంచాయతీలు వైసీపీ మద్దతుదారుల కైవసం అయ్యాయి. టీడీపీకి 2,063 పంచాయతీలు దక్కాయి. కాగా, పంచాయతీ ఎన్నికలు సాఫీగా జరిగుంటే 90 శాతం స్థానాలు వైసీపీ మద్దతుదారులే విజయం సాధించేవారని పెద్దిరెడ్డి అన్నారు.