minister puvvada ajay on rtc bus passes, ticket charges

ప్రయాణికులకు గుడ్ న్యూస్ : ఆర్టీసీ బస్సులో పాస్ లకు అనుమతి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేకంగా బస్సులు నడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ బస్సుల్లో పాస్ లు చెల్లడం లేదు. పాస్ లను అనుమతించడం లేదు. ప్రతి ఒక్కరి

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేకంగా బస్సులు నడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ బస్సుల్లో పాస్ లు చెల్లడం లేదు. బస్ పాస్ లను అనుమతించడం లేదు. ప్రతి ఒక్కరి దగ్గర టికెట్ చార్జీ వసూలు చేస్తున్నారు. దీనిపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభుత్వం స్పందించింది. ప్రయాణికులకు గుడ్ న్యూస్ వినిపించింది. ఆర్టీసీ బస్ పాస్ లను యథావిధిగా అనుమతించాలని ఆదేశించింది. విద్యార్థులు, వికలాంగులు, ఉద్యోగులు, మీడియాతో పాటు బస్ పాసులన్నీ అనుమతించాలని రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ చెప్పారు. బస్ పాసులు అనుమతించడం లేదు అనే ఫిర్యాదు రాకూడదని మంత్రి స్పష్టం చేశారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం రవాణా వ్యవస్థకు చర్యలు తీసుకుందని మంత్రి తెలిపారు. ప్రయాణికులకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా బస్సులు నడుపుతున్నామని చెప్పారు. ప్రస్తుతం సరిపడా బస్సులు తిరుగుతున్నాయని.. ఇక నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలపై దృష్టి పెడుతున్నామని చెప్పారు. టికెట్ ధర కంటే ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. దసరాకి వెళ్లిన ప్రయాణికుల తిరుగు ప్రయాణం కోసం చేస్తున్న ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై మంత్రి అజయ్, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఇన్ ఛార్జ్ ఎండీ సునీల్ శర్మ అన్ని జిల్లాల ఆర్టీసీ ప్రాంతీయ, డిపో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 4 గంటలకుపైగా సుదీర్ఘంగా చర్చించారు.

కొన్ని చోట్ల టికెట్ ధర కంటే ఎక్కువ తీసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయని.. ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రయాణికులకు మంత్రి సూచించారు. ఆయా రూట్లలో ఉండే ఛార్జీల పట్టికను ప్రతి బస్సులోనూ ఉంచుతామన్నారు. దీని కోసం ప్రతి డిపోలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామని, దీనికి డీఎస్పీ స్థాయి అధికారిని ఇంఛార్జ్ గా నియమిస్తున్నట్లు చెప్పారు. అక్టోబర్ 14 నుంచి స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం కానుండటంతో.. షెడ్యూల్ ప్రకారం బస్సులను నడుపుతామన్నారు. ప్రతి డిపోలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ముందు ఎలాంటి టూర్ షెడ్యూల్ ఉండేదో అదే షెడ్యూల్ ను అమలు చేస్తామన్నారు.

Related Posts