లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

మమతకి భారీ షాక్..మరో మంత్రి రాజీనామా

Published

on

minister-quits-mamata-banerjee-cabinet-weeks-after-rebels-joined-bjp1

Minister Quits Mamata Banerjee Cabinet :మరో నాలుగు నెలల్లో వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ అధికార తృణమూల్​ కాంగ్రెస్​కు మరో ఎదురుదెబ్బ తగిలింది. యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ సహాయ మంత్రి, మాజీ క్రికెటర్​ లక్ష్మీ రతన్​ శుక్లా తన పదవికి మంగళవారం రాజీనామా చేశారు. తృణమూల్ కాంగ్రెస్ హౌరా జిల్లా అధ్యక్ష పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు.

శుక్లా.. ఇప్పటికే తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గవర్నర్​ జగదీప్​ ధన్​కర్​లకు పంపించారు. రాష్ట్రంలో కీలక నేత సువేందు అధికారి సహా పలువురు ఎమ్మెల్యేలు పార్టీని వీడి బీజేపీలో చేరిన కొద్దిరోజులకే.. శుక్లా కూడా మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే ఎమ్మెల్యే పదవికి మాత్రం శుక్లా రాజీనామా చేయలేదు. టీఎంసీ ఎమ్మెల్యేగా శుక్లా కొనసాగనున్నారు.

బెంగాల్​ రంజీ క్రికెట్​ టీం మాజీ కెప్టెన్​ శుక్లా.. హావ్​డా (ఉత్తర) నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శుక్లా బీజేపీలో చేరుతాడంటూ వస్తున్న వార్తలను ఆయన సన్నిహితులు తోసిపుచ్చారు. అసలు రాజకీయాలకే ఉద్వాసన పలకాలని లక్ష్మీ రతన్ శుక్లా అనుకుంటున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈసారి పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో టీఎంసీ సైతం తాడోపేడో తేల్చుకునేందుకు పట్టుదలగా ఉంది.