Mischievous baby elephant pushes friend in water.. Just like humans, says Twitter

మనుషుల్లానే మిత్రులతో జలకాలాడుతున్న ఏనుగు పిల్లలు.. వీడియో వైరల్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

పిల్లలందరూ తమ స్నేహితులతో కలిసి ఏవిధంగా ఆటలు ఆడుకుంటారో అదే విధంగా ఏనుగు పిల్లలు కూడా తమ స్నేహితులతో కలిసి నీటిలో ఆటలు ఆడుతున్నా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇండియన్ ఫారెస్టు ఆఫీసర్ సుశాంత్ నందా ఈ వీడియోని  ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘తుంటరి ఆటలు ఆడటంలోను ఏనుగు పిల్లలు విజయం సాధించాయనే క్యాప్షన్ పెట్టారు.

ఈ వీడియోలో రెండు ఏనుగు పిల్లలు ఒకదాని వెనుక ఒకటి నడుస్తున్నట్లు కనిపిస్తుంది. నీటి మడుగు దగ్గర నిలబడి నీటి వైపు చూస్తున్న సమయంలో ఒక ఏనుగు పిల్ల ఇంకొక ఏనుగు నీటిలోకి నెట్టం కనిపిస్తుంది. ఏనుగులు కూడా మనుషుల లాగానే తమ స్నేహితులతో కలిసి కొంటె ఆటలు ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నాయి.

 ఈ వీడియోని షేర్ చేసినప్పటి నుంచి 53 వేల మంది పైగా వీక్షించారు. 4 వేలకు పైగా రీట్విట్ట్ చేయబడింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు మాత్రం ‘లవ్లీ వీడియో, పిల్లలు, మనుషులైనా, జంతువులైనా ఒకటే’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related Posts