అర్థరాత్రి, ఐలవ్ యూ అంటూ మహిళా ఎస్ఐకి మేసేజ్ పంపిన జడ్జి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

అర్ధరాత్రి వేళ తనకు ఐలవ్ యూ అంటూ మెసేజ్ పంపారంటూ ఓ మహిళా ఎస్ఐ ఏకంగా జడ్జిపైనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన గుజరాత్ లోని అమ్రేలి జిల్లాలో జరిగింది. అమ్రేలి జిల్లాలోని రాజుల పట్టణానికి చెందిన సెషన్స్ కోర్టు అదనపు న్యాయమూర్తి మొబైల్‌ నుంచి స్థానిక మహిళా ఎస్ఐకి ఐ లవ్ యు అంటూ మేసేజ్ వచ్చింది.

ఆగస్టు 3lవ తేదీన, తెల్లవారుజామున 2.30గంటల సమయంలో.. గుడ్ మార్నింగ్, మిస్ యు డియర్, లవ్ యూ టూ అంటూ వరుసగా సందేశాలు వచ్చాయి. తన ఫోన్ కి వచ్చిన మెసేజ్ లను చూసుకున్న ఎస్ఐకి మైండ్ బ్లాంక్ అయ్యింది. గుర్తు తెలియని ఫోన్ నంబర్ నుంచి ఐలవ్ యూ అంటూ మెసేజ్ లు రావడమేంటని కంగారుపడింది. వెంటనే ఆ నంబర్ కు ఫోన్ చేసింది.

కాల్ చేసినా ఎవరూ లిఫ్ట్ చెయ్యలేదు. కాసేపటి తర్వాత ఎస్ఐ మరోసారి ఆ నెంబర్ కు కాల్ చేసింది. ఈసారి కాల్ ని లిఫ్ట్ చేశారు. ఎవరు మాట్లాడుతున్నారు అని ఎస్ఐ అడగ్గా.. నేను సెషన్స్ కోర్టు అదనపు న్యాయమూర్తిని అని సమాధానం వచ్చింది.

దీంతో ఆమె మరింతగా నిర్ధాంతపోయింది. అర్ధరాత్రి వేళ ఐలవ్ యూ అంటూ సందేశాలు పంపడమేంటి అని జడ్జిని నిలదీశారు ఎస్ఐ. దీనికి ఆ జడ్జి చాలా కూల్ గా సమాధానం ఇచ్చారు. ఆ సందేశాలు పంపింది నేను కాదు, పొరపాటున తన పనిమనిషి పంపింది అని జవాబిచ్చారు.

జడ్జి సమాధానంతో మహిళా ఎస్ఐ మరింత ఆగ్రహానికి గురయ్యారు. మీ ఫోన్ నుంచి పనిమనిషి ఎలా సందేశాలు పంపుతుంది అంటూ జడ్జిని నిలదీశారు. అంతటితో ఊరుకోలేదు. దీనిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సమగ్ర దర్యాప్తు జరిపించి నిందితులను శిక్షించాలని అధికారులను కోరారు.

ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. జడ్జి మొబైల్ నుంచి మహిళా ఎస్ఐకి మేసేజ్ లు రావడం తెలిసి అంతా విస్తుపోయారు. అటు పోలీసులు, ఇటు న్యాయమూర్తులు అంతా దీనిక గురించే డిస్కస్ చేసుకుంటున్నారు.

కాగా, జడ్జి చెప్పినదాంట్లో నిజం ఎంత? నిజంగానే ఆయనకు ఏమీ తెలియదా? లేక ఆయన నాటకాలు ఆడుతున్నాడా? ఆయన పనిమనిషి ఇదంతా చేశారా? జడ్జి మొబైల్ ఫోన్, పని మనిషి చేతిలో ఎందుకు ఉంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం రాబట్టే పనిలో పోలీసులు ఉన్నారు.

Related Posts