లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime

ఒక్కరోజే 10మంది అదృశ్యం.. ఎటు వెళ్తున్నారు? ఏమైపోతున్నారు? హైదరాబాద్‌లో మిస్సింగ్ కేసుల కలకలం

Published

on

missing cases in hyderabad: హైదరాబాద్‌లో మనుషులు మాయం అయిపోతున్నారు. ఎటు వెళ్తున్నారో తెలియదు.. ఏమైపోతున్నారో తెలియదు. ఉన్నట్టుండి అదృశ్యమవుతున్నారు. భాగ్యనగరంలో నాలుగు రోజుల్లోనే వందలాది మంది కనిపించకుండా పోయారు. వీరిలో యువతులు, మహిళలు, చిన్నారులే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. వరుస మిస్సింగ్ కేసులు పోలీసులకు సవాల్‌గా మారింది.24గంటల్లో 10 మంది అదృశ్యం:
హైదరాబాద్‌లో మిస్సింగ్ కేసుల కలకలం.. ఒక్కరోజే 10 మంది అదృశ్యం..ఎటు వెళ్తున్నారు? ఏమైపోతున్నారు? భాగ్యనగరంలో మిస్టరీగా మిస్సింగ్ కేసులు.. ఆచూకీ కోసం పోలీసుల విశ్వప్రయత్నం. హైదరాబాద్ నగరంలో మిస్సింగ్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. కేవలం 24 గంటల వ్యవధిలో ఏకంగా 10 మంది అదృశ్యం కావడం ఆందోళనకు గురి చేస్తోంది. వీరంతా మహిళలు, యువతులు, చిన్నారులే. వీరంతా ఎక్కడున్నారో తెలియడం లేదు. ఎవరు తీసుకెళ్లారో తెలియదు. ఉన్నట్టుండి ఒక్కసారిగా కనిపించకుండా పోవడం టెన్షన్‌కు గురిచేస్తోంది.

కూకట్ పల్లిలో పిల్లలతో సహా వివాహిత ఆదృశ్యం….తెలంగాణలో పెరుగుతున్న మిస్సింగ్ కేసులు


కొన్ని పరిష్కారం.. పెండింగ్‌లో మరికొన్ని
పోలీసులకు ఈ మిస్సింగ్ కేసులు సవాల్ గా మారుతున్నాయి. కొన్ని కేసులు పరిష్కారమౌతున్నా.. మరికొన్ని తేలకుండానే మిగిలిపోతున్నాయి. తమ వారు ఎక్కడ ఉన్నారో… ఎలా ఉన్నారో తెలియక కుటుంసభ్యులు ఆందోళన పడుతున్నారు. తమవారు కనిపించడం లేదంటూ పోలీసులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. అదృశ్యమవుతున్న వారిలో మహిళలు, యువతులతో పాటు చిన్నారులూ ఉన్నారు.కూకట్‌పల్లిలో మిస్సైన తల్లి, ఇద్దరు పిల్లలు:
బుధవారం కూకట్‌పల్లిలో మిస్సైన తల్లి, ఇద్దరు పిల్లల జాడ కోసం బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో ఆరా తీసినా ఫలితం లేకపోయింది. భర్త ప్రేమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మానస, ఆమె పిల్లలను కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయిన ప్రాంతంలో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అలాగే బస్టాండ్, రైల్వేస్టేషన్‌లలోనూ లుక్‌ అవుట్ నోటీసులు ఇచ్చారు.

పంజాగుట్ట పరిధిలో మరో ముగ్గురు మిస్సింగ్:
ఈ కేసు మిస్టరీ వీడకముందే పంజాగుట్ట పీఎస్‌ పరిధిలో మరో ముగ్గురు అదృశ్యమవ్వడం కలకలం రేపింది. నిమ్స్ ఆసుపత్రిలోని క్వార్టర్స్‌లో నివాసముంటున్న 19 ఏళ్ల వనతి ఉన్నట్టుంది మాయమైపోయింది. అక్టోబర్ 29న ఇంటర్వ్యూకి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. మళ్లీ తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో భయపడిపోయిన కుటుంబ సభ్యులు పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

మైనర్ బాలికతో పాటు యువతి మిస్సింగ్:
పంజాగుట్ట పీఎస్ పరిధిలోనే మరో మిస్సింగ్ కేసు నమోదైంది. మైనర్ బాలికతో పాటు యువతి అదృశ్యమైనట్లు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. ఖైరతాబాద్ ప్రేమ్ నగర్ లో నివాసముంటున్న శాంతకుమారి కూతురు పావని, ఆమె సోదరి కుమార్తెలు అక్టోబర్ 29న రాత్రి ట్యాంక్‌ బండ్ వెళ్లి వస్తామని చెప్పి బయటికెళ్లారు. తెల్లవారినా ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

ఇక హయత్‌నగర్ పరిధిలో ఇద్దరు చిన్నారులు మిస్సయ్యారు. కుంట్లూరు రాజీవ్ గృహకల్పలో నివాసముంటున్న సౌమ్యకు కొడుకు శ్రీపాల్, కూతురు ప్రేమ ఉన్నారు. వీళ్లు కూడా అక్టోబర్ 29న రాత్రి బయటికెళ్లి మళ్లీ తిరిగి రాలేదు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. అయినప్పటికీ పిల్లల జాడ తెలియకపోవడంతో నాలుగు బృందాలుగా ఏర్పడి ముమ్మర దర్యాప్తు చేపట్టారు.

తెల్లారేసరికి పిల్లలు లేరు:
5 సంవత్సరాల క్రితం భర్త నుంచి విడిపోయిన సౌమ్య ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తోంది. 29న సాయంత్రం పిల్లలతో షాపింగ్ వెళ్లొచ్చిన సౌమ్య.. ఆ రాత్రి ముగ్గురు నిద్రపోయారు. అయితే తెల్లవారే సరికి తమ పిల్లలు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పిల్లలను తన భర్తే తీసుకెళ్లాడేమోనని అనుమానంగా ఉన్నట్లు చెబుతోంది.తల్లితో పాటు రెండు నెలల బాబు మిస్సింగ్:
ఇక ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో తల్లితో పాటు రెండు నెలల బాబు అదృశ్యమయ్యాడు. అంబికానగర్‌కు చెందిన శృతి అనే వివాహిత.. తన రెండు నెలల బాబును తీసుకొని అక్టోబర్ 29న ఉదయం ఇంటి నుంచి వెళ్లిపోయింది. మళ్లీ తిరిగి రాకపోవడంతో ఆమె తల్లి సుశీల ఛత్రినాక పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు పరిసర ప్రాంతాల్లో విచారణ జరుపుతున్నారు.

భాగ్యనగరంలో మిస్సింగ్‌ కేసులు పోలీసులకు సవాల్‌ విసురుతున్నాయి. ఒక కేసుపై కాన్‌సన్‌ట్రేషన్‌ పెట్టేలోపే.. మరికొన్ని మిస్సింగ్‌ కేసులు వచ్చిపడుతున్నాయి. ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉన్నాయి. అంతకంతకూ పేరుకుపోతున్న మిస్సింగ్ కేసులు పోలీసులకు తలనొప్పిగా మారాయి.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *