Home » మీ ఓటర్ ఐడీ కార్డ్ మిస్సైందా? నో ప్రాబ్లం.. ఏదైనా గుర్తింపు కార్డు చూపించి ఓటేయొచ్చు
Published
2 months agoon
By
bheemrajghmc elections voting : మీరు గ్రేటర్ పరిధిలో ఓటర్లా.. మీ ఓటర్ ఐడీ కార్డ్ మిస్సైందా? అయినా నో ప్రాబ్లం.. మీరు నిశ్చితంగా ఓటు వేయొచ్చు. ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డును చూపించి ఓటర్ స్లిప్‌తో ఓటేయొచ్చు. ఓటరు లిస్టులో పేరుండి ఓటర్ కార్డు లేకపోయినా ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం అనుమతించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటరు గుర్తింపు కార్డుకు ప్రత్యామ్నాయంగా 18 గుర్తింపుకార్డుల్లో ఏదైనా ఒక కార్డు చూపించినా ఓటు వేసేందుకు అనుమతిస్తుంది.
ఓటు వేసేందుకు ముందు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు గుర్తింపు నిర్ధారణకు కార్డులను చూపించాల్సి ఉంటుంది. 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఫోటోతో కూడిన సర్వీస్ ఐడెంటిఫై కార్డ్, ఫోటోతో కూడిన బ్యాంకు పాస్‌బుక్, పాన్ కార్డులను చూపించి ఓటు వేయొచ్చు.
RGI, NPR స్మార్ట్ కార్డ్, జాబ్ కార్డ్, హెల్త్ కార్డ్, ఫోటోతో కూడిన పింఛన్ డాక్యుమెంట్, రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, ఫ్రీడమ్ ఫైటర్ ఐడెంటిటీ కార్డు, ఆర్మ్స్ లైసెన్స్ కార్డు, అంగవైకల్యం సర్టిఫికెట్, లోక్‌సభ, రాజ్యసభ మెంబర్ ఐడెంటిఫై కార్డు, పట్టదారు పాస్‌బుక్‌ను గుర్తింపు కార్డులుగా చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.