Home » బేరాలుండవమ్మా : దుకాణదారులు లేని సంత..నిజాయితీకి కేరాఫ్ అడ్రస్..
Published
2 months agoon
By
nagamaniMizoram without shopkeepers Market : మిజోరాం రాజధాని ఐజ్వాల్ లో వినూత్న సంత జరుగుతుంటుంది. ఆ సంతలో కూరగాయాలు అమ్మేందుకు ఎవ్వరూ ఉండరు. తూకం వేసి ఇవ్వటానికి కూడా ఎవ్వరూ ఉండరు. కేవలం ఆ కూరగాయల ధరలు తెలిపే బోర్డులు మాత్రమే ఉంటాయి.
కూరగాయలు కొనుక్కోవటానికి వెళ్లినవారే తూకం వేసుకుని సరిపడా డబ్బుల్ని అక్కడ ఉండేఓ బుట్టలో వేసేయాలి. ఏంటీ అడగటానికి..చూడటానికి ఎవ్వరూ ఉండరు కదాని..చేతివాటం చూపిందామనుకుంటున్నారా? దానికి అవకాశం ఉందని కూడా అనుకుంటున్నారా? నిజమే దానికి కూడా అవకాశం ఉంటుంది? కానీ ఆ కూరగాయలు పండించే రైతులకు మనుషుల మీద ఇంకా నమ్మకం పోలేదని తెలిపేందుకు ఈ సంత ఉదాహరణ అని చెప్పాలి. ఈ వింతైన సంత ఏళ్లకేళ్లనుంచి కొనసాగుతోంది. ఇలాగే. నిజాయితీ కరవైపోయిన ఈ రోజుల్లో నికార్సైన మనుషులు కూడా ఉంటారని నమ్మకానికి ఈ సంత ఉదాహరణగా చెప్పుకోవచ్చు..
మిజోరం రాజధాని ఐజ్వాల్ కు 65 కిలోమీటర్ల దూరంలో ఉండే సీలింగ్ లో ఈ ఆదర్శవంతమైన సంత ఏళ్లనుంచి కొనసాగుతోంది. రైతులు పండించిన ఈ పంటల్ని ఈ సంతకు పట్టుకొచ్చి వాటి ధరల్ని బోర్డుల మీద రాసి కూరగాయల్ని అక్కడ వెదురు బుట్టల్లో సర్దేసి వెళ్లిపోతారు. ఈ సంతలో బేరాలుండవు..ఎందుకంటే దళారుల మాటేఉండదు కాబట్టి. రైతులే ఈ కూరగాయల్ని పండించి ఈ సంతలో పెట్టి రేట్లు నిర్ణయించి బోర్డులమీద రాసి వెళ్లిపోతారు.
కొనుక్కోవాలనుకునేవాళ్లు వాళ్లే వాటిని తూకం వేసుకుని దానికి సరిపడా డబ్బుల్ని అక్కడే ఉండే బుట్టలో వేసేస్తారు. అన్నదాతలు పండించే కూరగాయాలు, పండ్లు, పూలు, చేపలు అన్నీకూడా పాకల్లో వెదురు బుట్టల్లో పెడతారు. వాటి ధరను బోర్డుపై రాసి వెళ్లిపోతారు.
కొనుక్కోవాలనుకువాళ్లు తమకు నచ్చినవి కొనుక్కుని డబ్బుల్ని పక్కనే ఉన్న డబ్బాల్లో వేయాలి. ఈ పద్ధతి చాలా ఏళ్లుగా వస్తోంది. ఇది వినటానికి ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ అది అక్కడి రైతులకు..కొనుక్కునేవారికి సర్వసాధారణమే. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే..ఈ కూరగాయలు అమ్మే రైతులు ఏనాడు మోసపోయిందీ లేదు.
దీంతో నష్టపోయింది లేదు. మనుషుల మీద వాళ్ల నమ్మకం ఏనాడు వమ్ము కాలేదు. ఈ సంతను చూడటానికి ఇక్కడ కొనటానికి చాలామంది వస్తుంటారు. ఈ పేరుతోనే ఈ సంత పర్యాటక ప్రదేశంగా మారిపోయింది. నిజాయితీకి చిరునామాగా మారిపోయి జనాలకు ఆకట్టుకుంటోంది.