లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Education and Job

మనుచరిత్రను అమలు చేయాలనే ప్రయత్నం స్టాలిన్ సంచలన ఆరోపణలు

Published

on

mk-stalin-fire-on-new-education-policy

మనుచరిత్రను అమలు చేయాలనే ప్రయత్నం చేస్తున్నారని National Education Policy 2020 పై డీఎంకే అధినేత స్టాలిన్ సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర కేబినెట్ రెండు రోజుల క్రితం ఆమోదించిన జాతీయ విద్యా విధానాన్ని ఆయన తప్పుబట్టారు. కొత్త విద్యా విధానంతో ద్రావిడులకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని దుయ్యబట్టారు. ఈ మేరకు ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశించి బహిరంగ లేఖ రాశారు.బలవంతంగా హిందీ, సంస్కృత భాషలను రద్దేందుకు కేంద్ర సర్కారు ప్రయత్నిస్తోందని విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా…డీఎంకే పోరాటం చేస్తుందని, వ్యతిరేకంగా భావ సారూప్య పార్టీలు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి జాతీయస్థాయి ఆందోళన చేపట్టనున్నట్లు ప్రకటించారు.

విద్యా వ్యవస్థపై రాష్ట్రాలకు పూర్తి అధికారాలున్నాయన్నారు. 10+2 విధానాన్ని ఎత్తేసి 5+3+3+4 విధానాన్ని తీసుకురావడంలో ఆంతర్యం ఏమిటని స్టాలిన్ ప్రశ్నించారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *