కరోనా మృతుడి అంత్యక్రియలకు హాజరైన ఎమ్మెల్యే

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనాతో మరణించిన మృతుడి అంత్యక్రియలకు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి హాజరయ్యారు. తిరుపతి నగర శివారులో గోవింద దామం ఎలక్ట్రిక్ స్మశాన వాటికకు వెళ్లిన ఆయన స్వయంగా దహన కార్యక్రమం నిర్వహించారు. మృతుడి కుటుంబ సభ్యులకు ఆయన ధైర్యం చెప్పాడు.ఈ సందర్భంగా ఆయన గోవింద దామంలో ప్రతి రోజు 15 నుంచి 20 కోవిడ్ మృతదేహాలకు దహన క్రియలు జరుగుతున్నాయని తెలిపారు. కరోనా విషయంలో ప్రతి ఒక్కరు మానవత్వ చూపించాల్సిన అవసరముందన్నారు. భౌతిక దూరం పాటించి కోవిడ్ తో మృతి చెందిన వారి దహన క్రియల్లో పాల్గొనవచ్చన్నారు.కోవిడ్ మృతదేహాల దహన క్రియలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. తిరుపతిలో అలాంటి సమస్య రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు.

Related Tags :

Related Posts :