MLA Manchi Reddy Kishan Reddy has denied the allegations

తహశీల్దార్ హత్య కేసు : ఆరోపణలన్నీ అబద్దాలే – మంచిరెడ్డి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఎమ్మార్వో విజయారెడ్డి హత్య కేసులో రాజకీయ నేతల పేర్లు రావడం కలకలం రేపింది. తహశీల్దార్‌ను బెదిరించారని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. వీటిని ఆయన ఖండించారు. స్థానిక ఎమ్మెల్యే ప్రమేయం ఉందని మల్ రెడ్డి రంగారెడ్డి చేసిన వ్యాఖ్యలపై 2019, నవంబర్ 06వ తేదీ బుధవారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు మంచిరెడ్డి. అప్పుడే శవ రాజకీయాలు మొదలు పెట్టారని విమర్శించారు.

రాజకీయంగా లబ్ది పొందేందుకే తనపై ఆరోపణలు చేస్తున్నారని, ఆరోపణలు చేసిన వ్యక్తి మూడు సార్లు ఓడిపోయిన వ్యక్తి అని విమర్శించారు. నిందితుడు సురేశ్ తండ్రి కృష్ణయ్య, పెద్దనాన్న దుర్గయ్య నుంచి మల్ రెడ్డి దివ్య, మల్ రెడ్డి కావ్యలు భూములు కొన్నారంటూ…దానికి సంబంధించిన పత్రాలు చూపించారు మంచిరెడ్డి. 11 మందికి పాస్ బుక్‌లు లేకున్నా..రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, సర్వే నెంబర్ 4లో 14 ఎకరాలను బెదిరించి వశం చేసుకున్నారని,  న్యాయం కోసం 60 మంది తన వద్దకు వచ్చారని, బాధితులు తన వద్దకు వస్తే..జాయింట్ కలెక్టర్‌తో మాట్లాడడం జరిగిందని గుర్తు చేశారు. పాస్ బుక్‌ల కోసం ఎమ్మార్వోపై తీవ్ర వత్తిడి తెచ్చారని తెలిపారు. ఈ భూములపై విచారణ చేయించాలని సీఎం కేసీఆర్‌ను కోరుతానన్నారు. 

412 ఎకరాల్లో ఎవరెవరు ఉన్నారో..వాళ్ల వివరాలు చెప్పాలన్నారు. ఈ భూములన్నింటిపై దర్యాప్తు చేయించాలని, భూ కబ్జా చేసింది మల్ రెడ్డి రంగారెడ్డి బంధువులేనని ఆరోపించారు. గౌరెల్లిలో భూమిని స్వాధీనం చేసుకొనేందుకు యత్నించారు. అంబర్ పేటలో ఓఆర్ఆర్ పక్కనే ఉన్న స్థలంలో 16 ఎకరాల భూమిని మల్ రెడ్డి ఫ్యామిలీ సభ్యులు కబ్జా చేశారని, దీని విలువ రూ.100 కోట్లు అని ఆరోపించారు. తనపై ఆరోపణలు చేస్తే..ఫ్రూప్ చేయాలని డిమాండ్ చేశారు. 

తహసీల్దార్‌ విజయారెడ్డి హత్యకు కారణం.. రంగారెడ్డి జిల్లా బాచారంలో  ఏడు దశాబ్దాలుగా కొనసాగుతున్న భూ వివాదం. మహారాష్ట్రకు చెందిన రాజా ఆనందరావు పేరిట ఉన్న 412 ఎకరాల భూమిని అప్పట్లోనే స్థానిక రైతులు  సాగు చేసుకునేవారు. కౌలుదారుల చట్టం అమల్లోకి రావడంతో.. ఇవన్నీ రైతుల హస్తగతమయ్యాయి. పహాణీల్లోనూ సాగు చేసుకుంటున్న రైతుల పేర్లే ఉన్నాయి. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం భూప్రక్షాళన చేసిన అనంతరం.. ఈ భూమి తమదంటూ సయ్యద్ యాసిన్ వారసులు తెరపైకి వచ్చారు. దీనిపై ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు రైతులు.

అయితే.. ఆర్డీవో సయ్యద్‌ యాసిన్‌ వారసులకే అనుకూలంగా తీర్పునిచ్చారు. ఆ తర్వాత.. జేసీ కోర్టును ఆశ్రయించారు రైతులు. అక్కడా తీర్పు అలానే వచ్చింది. దీంతో.. హైకోర్టులో కేసు వేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది.  ఔటర్‌ రింగ్‌ రోడ్డును ఆనుకుని ఉన్న ఈ 110 ఎకరాల భూమి తహసీల్దార్‌ విజయారెడ్డిని హత్య చేసిన సురేశ్ కుటుంబానికి ఇందులో భూమి ఉంది. ఈ భూ వివాదంపైనే కొంతకాలంగా సురేశ్ కుటుంబ సభ్యులు విజయారెడ్డిని కలుస్తున్నారు. కొంతమంది రైతులు.. తమ భూములను స్థానికంగా ఉన్న రాజకీయ నేతలకు విక్రయించారు. అయితే.. వీటికి పట్టాదార్ పాస్‌ పుస్తకాలు లేకపోవడంతో.. భూమార్పిడి జరగలేదు .ఈ విషయంలోనే రైతులపై కొనుగోలుదార్ల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చినట్లు తెలుస్తోంది. 
Read More : ప్రైవేటు రూట్లలో ఆర్టీసీ : పర్మిట్ వల్ల నష్టమే – కుమార స్వామి

READ  మున్సిపాలటీల ఆదాయాన్ని స్థానికంగానే ఖర్చు చేయాలి : సీఎం జగన్

Related Posts