లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story

గుండెపోటుతో ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కన్నుమూత

Published

on

MLA Nomula Narsimhaiah died : నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య (64) కన్నుమూశారు. గుండె పోటుతో హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం (డిసెంబర్1, 2020) మృతి చెందారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్నారు.2014 ఎన్నికలకు ముందు నోముల టీఆర్ఎస్ లో చేరారు. అంతకు ముందు సీపీఎంలో కీలక నేతగా ఉన్నారు. సీపీఎం తరపున నకిరేకల్ ఎమ్మెల్యేగా పనిచేశారు. నాగార్జునసాగర్ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిపై నోముల గెలుపొందారు. 1956 జనవరి 9న నోముల నర్సింహయ్య జన్మించారు. నకిరేకల్ నియోజకవర్గం పాలెం ఆయన స్వగ్రామం.నోముల న్యాయవాదిగా జీవితం ఆరంభించారు. నకిరేకల్ ఎంపీపీగా ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభం అయింది. 1999, 2004లో నకిరేకల్ నుంచి సీపీఎం తరపున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం నాగార్జున సాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న నోముల చికిత్స పొందుతూ మృతి చెందారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *