లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime

రాహుల్ సిప్లిగంజ్‌పై దాడి చేసింది ఎమ్మెల్యే బంధువులు, కారణం ఇదే

బిగ్ బాస్ సీజన్ 3 విజేత, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పై బీరు సీసాలతో దాడి చేసిన ఘటన సంచలనం రేపుతోంది. బుధవారం(మార్చి 5,2020) అర్థరాత్రి గచ్చిబౌలిలోని ప్రిజమ్(prism)

Published

on

mla relatives attack on Rahul Sipligunj in pub

బిగ్ బాస్ సీజన్ 3 విజేత, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పై బీరు సీసాలతో దాడి చేసిన ఘటన సంచలనం రేపుతోంది. బుధవారం(మార్చి 5,2020) అర్థరాత్రి గచ్చిబౌలిలోని ప్రిజమ్(prism)

బిగ్ బాస్ సీజన్ 3 విజేత, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పై బీరు సీసాలతో దాడి చేసిన ఘటన సంచలనం రేపుతోంది. బుధవారం(మార్చి 5,2020) అర్థరాత్రి గచ్చిబౌలిలోని ప్రిజమ్(prism) పబ్ లో గొడవ జరిగింది. అమ్మాయి విషయంలో ఇరు వర్గాలు కొట్టుకున్నాయి. కొందరు యువకులు రాహుల్ సిప్లిగంజ్ పై బీరు సీసాలతో దాడి చేశారు. ఈ దాడిలో రాహుల్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడి తలకు గాయమైంది. రక్తస్రావం అయ్యింది. రాహుల్ కింద పడిపోయాడు. సకాలంలో పోలీసులు స్పందించడంతో గొడవ సద్దుమణిగింది. ఆ తర్వాత రాహుల్ ను ఆసుపత్రికి తరలించారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రాహుల్ చికిత్స తీసుకున్నాడు. చిన్న గాయమే అంటూ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. దాడి ఘటనపై ఫిర్యాదు చేయకుండానే రాహుల్ వెళ్లిపోయాడు. 

దాడి చేసింది ఎమ్మెల్యే బంధువులు:
దీంతో పబ్ లో గొడవపై సుమోటో కేసు నమోదు చేసేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు. రాహుల్ పై దాడి చేసింది ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బంధువులని పోలీసులు తేల్చారు. కాగా గొడవకు పలు కారణాలు వినిపిస్తున్నాయి. రెండు వర్గాలు రెండు రకాల వెర్షన్లు వినిపిస్తున్నాయి. రాహుల్ స్నేహితురాలితో కొందరు యువకులు అసభ్యంగా ప్రవర్తించారని, వారిని నిలదీసిన రాహుల్ పై ఆ యువకులు బీరు సీసాలతో దాడి చేశారని కొందరు అంటున్నారు. రాహుల్ సిప్లిగంజ్.. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బంధువులను వేధించాడని, దాంతో వారు దాడి చేశారని మరికొందరు అంటున్నారు. ఏది నిజమో పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.(బిగ్ బాస్-3 విజేత రాహుల్ సిప్లిగంజ్ పై దాడి)

ఊహించని విధంగా బిగ్ బాస్ టైటిల్ విన్నర్:
బిగ్ బాస్ సీజన్ 3 లో అసలు ఫేవరేట్ కాని రాహుల్.. టైటిల్ విన్నర్ అయ్యాడు. పునర్నవితో లవ్ అంటూ షో ని రంజింప చేసిన రాహుల్ కు ఆడియన్స్ ఓట్లు వేశారు. నిజ జీవితంలో భార్యా భర్తలైన వితిక, వరుణ్ సందేశ్ కంటే రాహుల్, పునర్నవి మధ్య నడిచే ఎపిసోడ్ అత్యంత రసవత్తరంగా సాగింది. బిగ్ బాస్ క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు రాహుల్ భారీ ప్లాన్ లే వేశాడు. ఇన్నాళ్ళు సింగర్ గానే అలరించిన రాహుల్ ఇక మీదట నటుడిగా కూడా కనిపించనున్నాడు.

రంగమార్తాండలో కీ రోల్:
కృష్ణవంశి దర్శకత్వంలో రంగమార్తాండ సినిమాలో రాహుల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘రంగమార్తాండ’ మరాఠీ సినిమా ‘నటసామ్రాట్’కు రీమేక్. ‘నటసామ్రాట్’ మరాఠీలో మంచి విజయం సాధించింది. ఇప్పుడు దీన్ని తెలుగులో తెరకెక్కిస్తున్నారు కృష్ణవంశీ. ఈ సినిమాలో రాహుల్ కు మంచి పాత్ర ఇచ్చారట. కెరీర్ ఫుల్ జోష్ లో ఉన్న రాహుల్.. అనవసరమైన గొడవల్లో చిక్కుకోవడం దురదృష్టమని ఆయన సన్నిహితులు అంటున్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *