సీఎం కొడుకుగా ఉండి ఎమ్మెల్యేగా గెలవలేని దద్దమ్మ లోకేష్, ఎమ్మెల్యే రోజా ఫైర్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ పై వైసీపీ నేత, నగరి ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. సీఎం కొడుకుగా, రాష్ట్ర మంత్రిగా ఉండి ఎమ్మెల్యేగా కూడా గెలవలేని దద్దమ్మ అంటూ లోకేష్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కరోనా సంక్షోభ సమయంలో విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉండి ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన తండ్రీ కొడుకులు దొంగల్లా పారిపోయి హైదరాబాద్‌లో దాక్కున్నారని రోజా విమర్శించారు. టీడీపీలోని అవినీతి గద్దలు సాక్ష్యాలతో సహా దొరికి అరెస్ట్ అయితే  వారిని పరామర్శించేందుకు పరిగెత్తుకుని ఏపీకి వచ్చారని మండిపడ్డారు. అప్పుడే ప్రజలకు ఆ ఇద్దరి నైజం అర్థమైందన్నారు. చంద్రబాబుకి, లోకేష్‌కి కేవలం అధికారం, డబ్బు మాత్రమే కావాలన్నారు. ప్రజలపై ఏమాత్రం అభిమానం లేదన్నారు రోజా.

ఏ పనీ పాట లేని లోకేష్ పబ్జీ ఆడుతున్నాడు:
ఆదివారం(జూన్ 28,2020) తిరుమల శ్రీవారిని రోజా దర్శించుకున్నారు. లోకేష్ ఇంట్లో తిని కూర్చొని ఇష్టారాజ్యంగా ప్రభుత్వంపై విమర్శలు చేయడం బాధాకరమన్నారు. మేము బతికుంటే చాలు, సేఫ్ గా ఉంటే చాలు, ఎవరు ఎక్కడ చచ్చినా పర్లేదు అనుకునే తరహా పెద్ద మనుషులు చంద్రబాబు, లోకేష్ అని రోజా అన్నారు. సీఎం జగన్ పబ్జీ అడుతున్నారని లోకేష్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. పబ్జీ ఆడేది జగన్ కాదు ఏ పనీ పాటా లేని లోకేష్ అని రోజా వ్యాఖ్యానించారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన వ్యక్తి సీఎం జగన్ అని రోజా చెప్పారు.

Related Posts