Home » చిత్తుగా ఓడించారని వైజాగ్ పై పవన్ కు కసి – రోజా
Published
6 months agoon
By
madhuవైజాగ్ కు క్యాపిటల్ సిటీ రావడం పవన్ ఇష్టం లేదని అనుకుంటానని ఎందుకంటే..గాజువాకలో చిత్తుగా ఓడించారని..అందుకని పవన్ వైజాగ్ పై కసి పెంచుకున్నారా ? నాకు వేరే కారణం కనిపించడం లేదని ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. బాబు ఏడుస్తున్నాడంటే…అర్థం ఉంది..రాష్ట్రంలో దోచుకున్న డబ్బులతో..అమరావతిలో భూములను రియల్ ఎస్టేట్ చేయాలని అనుకున్న వారి ఆశలను ప్రభుత్వం అడియాశలు చేసిందని, మిగతా పార్టీలకు ఏమి వచ్చిందని సూటిగా ప్రశ్నించారు.
మూడు రాజధానుల విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యతిరేకించడంపై ఎమ్మెల్యే రోజా గరం గరం అయ్యారు. 2020, జులై 3వ తేదీ సోమవారం ఆమె తిరుమలకు వచ్చారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. అధికార వికేంద్రీకరణపై జనసేనానీ వైఖరిపై మండిపడ్డారు. గుంటూరు, కృష్ణా జిల్లాల వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని పవన్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
పవన్ చేసిన వ్యాఖ్యలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు చేయడం వల్ల…జనసేనానికి ఇష్టం లేదా అని ప్రశ్నించారు. హైదరాబాద్ లో జరిగన తప్పు అమరావతిలో జరగకూడదనే రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులపై ప్రభుత్వం ఈ విధంగా నిర్ణయం తీసుకుందని తెలిపారు.
లక్ష కోట్ల రూపాయలను అమరావతిలో పెట్టి అభివృద్ధి చేస్తే..భవష్యత్ లో మళ్లీ…ఉత్తరాంధ్రలో కానీ రాయలసీమలో వెనకబాటుతనం, తిరుగుబాటు రావడం జరుగుతుందని అందుకనే ప్రభుత్వం ఆ విధంగా నిర్ణయం తీసుకుందన్నారు ఎమ్మెల్యే రోజా.