Home » 94 శాతం సక్సెస్ తర్వాత ఎమర్జెన్సీ ఆథరైజేషన్ కావాలంటోన్న మోడర్నా
Published
2 months agoon
By
subhnCovid-19 vaccine తయారీలో 94శాతం సక్సెస్ సాధించిన తర్వాత మోడర్నా కంపెనీ యూఎస్, యూరోపియన్ ఎమర్జెన్సీ ఆథరైజేషన్ వెంటనే కావాలని అడుగుతుంది. సోమవారం జరిపిన లేట్ స్టేజ్ స్టడీలో వ్యాక్సిన్ 94.1శాతం ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నట్లు తేలింది. పైగా ఎటువంటి సీరియస్ సేఫ్టీ అంశాల గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు.
కొన్ని కేసుల్లో వంద శాతం సక్సెస్ రేట్ నమోదైందని తెలిసింది. ఈ ఏడాది యూఎస్ ఎమర్జెన్సీ ఆథరైజేషన్ కోసం రెడీ అయిన రెండో వ్యాక్సిన్ ఇది.
‘చాలా ప్రభావవంతమైన వ్యాక్సిన్ రెడీ చేసినట్లుగా మేం నమ్ముతున్నాం. అది నిరూపించడానికి మా దగ్గర డేటా కూడా ఉంది’ అని మోడర్నా చీఫ్ మెడికల్ ఆఫీస్ డా.తల్ జాక్స్ టెలిఫోన్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ మహమ్మారిపై పనిచేయడంలో మా వ్యాక్సిన్ కీలకంగా వ్యవహరిస్తుందని నమ్ముతున్నాం’ అని చెప్పారు.
వ్యాక్సిన్ 94.1శాతం సక్సెస్ ఫుల్ అవడంతో తాను చాలా ఎమోషనల్ అయినట్లు చెబుతున్నారు జాక్స్. ‘దీన్ని చూసి ఏడ్చేశాను కూడా. మన చుట్టూ ఉన్న ప్రపంచానికి వ్యాక్సిన్ పనిచేస్తుందని నమ్ముతున్నాం’ అని ఆయన అన్నారు.
జర్మన్ పార్టనర్ బయోటెక్ ఎస్ఈ, ఫైజర్ ఇన్క్ తర్వాత మోడర్నా అనౌన్స్మెంట్ ఇచ్చింది. కొత్త టెక్నాలజీ వాడి 95శాతం ఎఫెక్టివ్ గా పనిచేస్తుండటంతో సింథటిక్ మెసేంజర్ ఆర్ఎన్ఏ(ఎమ్ఆర్ఎన్ఏ) అని అంటున్నారు.
నవంబర్ 16న చేసిన విశ్లేషణలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని చెప్పింది మోడర్నా. సామర్థ్యం కల వ్యాక్సిన్ ను తయారుచేశాం. పైగా దీని వల్ల సేఫ్టీలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోనవసరం లేదు. ఈ సంవత్సరం చివరికల్లా మోడర్నా ట్రయల్స్ పూర్తి దశలో ముగించాల్సి ఉంది. అంతేకాకుండా 2021 ఆరంభంలోనూ యూత్ కు ఈ పరీక్షలు చేయాల్సి ఉంది.
ఈ సంస్థ అంచనాల ప్రకారం.. వ్యాక్సిన్ వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి అందుబాటులో ఉంటుందని జాక్స్ చెప్పారు. మిగిలిన వ్యాక్సిన్ మేకర్స్ యూత్ మీద వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుందోనని స్టడీ చేస్తున్నారు. 2020చివరి నాటికి యునైటెడ్ స్టేట్స్ లో 20మిలియన్ డోసులు పంపిణీ చేయాలని ప్లాన్ చేసుకుంది.