లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Political

మోడీ పోతేనే ఏపీ కి న్యాయం: ముగ్గురు మోడీలు అడ్డుపడుతున్నారు

Published

on

Modi is gone, Justice to AP

చిత్తూరు: కేంద్రంలో ఎన్డీయేకి ప్రత్యామ్నాయంగా కూటనిని సిధ్ధంచేస్తున్నామని చంద్రబాబు నాయుడు తెలిపారు. సంక్రాంతి పండుగకు స్వగ్రామం నారావారి పల్లెకు వచ్చిన ఆయన మంగళవారం  జరిగిన విలేరుల సమావేశంలో మాట్లాడుతూ …వచ్చే ఎన్నికల్లో బీజీపీని అధికారానికి దూరం చేయటానిక కృషి చేస్తామని, ఎన్డీయే కు వ్యతిరేకంగాఏర్పడే కూటమి ఎన్నికల ముందు ఏర్పడుతుందా,  ఎన్నికలైన తర్వాత ఏర్పడుతుందా  అనేది త్వరలో తెలుస్తుందని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా కలిసి వచ్చే ఏపార్టీతో ఐనా పనిచేయటానికి సిధ్దంగా ఉన్నానని చంద్రబాబునాయుడు చెప్పారు.  
కేంద్రంలో  బీజేపీని అడ్డుపెట్టుకుని ఏపీలో ప్రతిపక్షపార్టీ ప్రతి అభివృధ్ది పనికి అడ్డుపడుతోందని అన్నారు.జగన్ కేసీఆర్ తో కుమ్మక్కయ్యారన్న విషయాన్ని పవన్  కళ్యాణ్ కూడా చెప్పారని, కేసీఆర్ సహకారంతో జగన్ ఏపీకి స్పెషల్ స్టేటస్ తీసుకువస్తానంటున్నారని, దాన్ని స్వాగతిస్తానని ఆయన తెలిపారు. కేంద్రంలో మోడీ పోతేనే ఏపీకి న్యాయం జరుగుతుందని చంధ్రబాబు అన్నారు. కేంద్రం రాష్ట్రాల అధికారాలను హరించి వేస్తోందని చంద్రబాబు ఆరోపించారు. కేసీఆర్.జగన్,మోడీ… ముగ్గురు మోడీలు ఏకమై రాష్ట్రాన్నిదెబ్బతీయాలనుకుంటున్నారని, ఐనా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు  అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు.  

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *