టీమిండియా క్రికెటర్ సిరాజ్ తండ్రి కన్నుమూత, అంత్యక్రియలకు దూరం!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Mohammed Siraj’s father passes away : టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ తండ్రి మహ్మద్ గౌజ్ (53) కన్నుమూశారు. కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న సిరాజ్ శోక సంద్రంలో మునిగిపోయాడు. ప్రస్తుతం ఇతను ఆస్ట్రేలియాలోని బయోబబుల్ లో ఉన్నాడు. కరోనా వైరస్ కారణంగా..అక్కడ అమలు చేస్తున్న నిబంధనల ప్రకారం…తండ్రి అంత్యక్రియలకు దూరం కానున్నట్లు సమాచారం. తన తండ్రి కోరిక ఒకటే ఉండేదని ‘mera beta, desh ka naam roshan karna’ (మేరా బేటా..దేశ్ కా నామ్ రోషన్ కర్నా), ఖచ్చితంగా చేస్తానని సిరాజ్ వెల్లడించారు.ఈ సందర్భంగా తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆటపై ఉన్న తన అభిరుచిని తెలుసుకుని..ఆటో రిక్షా నడుపుతూ…కష్టాలను ఎదుర్కొన్నారని తెలిపారు. తన జీవితంలో గొప్ప వ్యక్తిని కోల్పోయానన్నారు. ఈ విషయం తెలుసుకున్న కోచ్ శాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీలు తనకు ధైర్యం చెప్పారన్నారు.సిరాజ్ భారత క్రికేటర్ గా ఎదగడంలో తండ్రి మహ్మద్ గౌజ్ కీలక పాత్ర పోషించారు. ఆటో డ్రైవర్ గా కుటుంబాన్ని పోషిస్తూ..సిరాజ్ కలను నెరవేర్చాడు. ఐపీఎల్ హైదరాబాద్ జట్టు రూ. 2.6 కోట్లకు సొంతం చేసుకోవడంతో సిరాజ్ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. భారత్ ఏ జట్టులో ప్లేస్ సంపాదించుకున్నాడు.నిలకడమైన ఆట తీరు కనబరుస్తూ..టీమిండియాకు ఎంపికయ్యాడు. ఇటీవలే కోల్ కతాలో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు తరపున సిరాజ్ ఆడాడు. మంచి ఆటతీరు కనబర్చాడు. రెండు మెయిడిన్ ఓవర్లు వేసిన సిరాజ్…తొలి బౌలర్ గా రికార్డు సృష్టించాడు. ఒక్క పరుగు ఇవ్వకుండా..మూడు వికెట్లు తీసిన బౌలర్ గా చరిత్రకెక్కాడు.

Related Tags :

Related Posts :