పథకం ప్రకారమే వైసీపీ నేత భాస్కరరావు హత్య, కొల్లు రవీంద్ర సూత్రధారి, ఎస్పీ రవీంద్రనాథ్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

సంచలనం రేపిన మచిలీపట్నం మార్కెట్‌ కమిటీ మాజీ అధ్యక్షుడు, వైసీపీ సీనియర్‌ నేత, మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు మోకా భాస్కరరావు హత్య కేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర అరెస్ట్ పై కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ మీడియాతో మాట్లాడారు. మోకా భాస్కరరావు హత్య కేసు వివరాలను ఎస్పీ వెల్లడించారు. పథకం ప్రకారమే భాస్కరరావు హత్య జరిగిందన్నారు. ఈ కేసులో కొల్లు రవీంద్ర భాగస్వామి అని చెప్పారు. మోకా హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేశామన్నారు. నిందితుల కాల్ డేటా పరిశీలించాకే వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు. 2013 నుంచే భాస్కరరావుని చంపాలని ప్లాన్ చేశారని ఎస్పీ చెప్పారు.

ycp leader murder

రాజకీయ భవిష్యత్తు ఉండదని చంపేశారు:
భాస్కరరావు కదలికలపై నిఘా వేసిన ప్రత్యర్థులు, హత్యకు 5 రోజుల ముందు నుంచే రెక్కీ నిర్వహించారని ఎస్పీ చెప్పారు. భాస్కరరావు హత్య కేసులో నిందితుల వాంగ్మూలం తీసుకున్నామన్నారు. హత్యకు ముందు నాంచారయ్య, కొల్లు రవీంద్ర మాట్లాడుకున్నారని ఎస్పీ తెలిపారు. భాస్కరరావుని చంపకుంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని భావించిన నిందితులు పథకం ప్రకారమే మర్డర్ చేశారని ఎస్పీ వెల్లడించారు. ఈ కేసులో తన పేరు బయటకు రాకుండా చూడాలని కొల్లు రవీంద్ర కోరినట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు నాంచారయ్య కొల్లు రవీంద్రకు ప్రధాన అనుచరుడు. మర్డర్ ప్లాన్ అమలు చేయడానికి 5 ముందు నుంచి తనకు ఫోన్ చేయొద్దని కొల్లు రవీంద్ర నాంచారయ్యతో చెప్పినట్టు విచారణలో తెలిసిందని ఎస్పీ చెప్పారు. తన ఫోన్ కు కాకుండా తన పీఏల ఫోన్లకు కాల్ చేస్తే తాను మాట్లాడతానని కొల్లు రవీంద్ర చెప్పినట్టు ఎస్పీ తెలిపారు. హత్యకు ముందు ఒకసారి, హత్య తర్వాత మరోసారి కొల్లు రవీంద్ర పీఏ ఫోన్ కి నాంచారయ్య కాల్ చేసినట్టు విచారణలో కనుగొన్నామని ఎస్పీ చెప్పారు. ప్రధాన నిందితుడు నాంచారయ్య, మృతుడు భాస్కరరావు ఒకే సామాజికవర్గానికి చెందినవారు కావడంతో, దాదాపు ఎనిమిదేళ్లుగా ఇద్దరి మధ్య రాజకీయ విభేదాలు ఉన్నట్టు ఎస్పీ తెలిపారు. భాస్కరరావు బతికున్నంత వరకు తనకు రాజకీయ మనుగడ ఉందడని భావించి 4 నెలల నుంచి భాస్కరరావు హత్యకు ప్లాన్ చేశారని అన్నారు.

kollu raneder 1

కొల్లు రవీంద్ర ప్రోద్బలంతోనే మోకా మర్డర్:
జూన్ 29వ తేదీన స్థానిక చేపల మార్కెట్‌లో మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు మోకా భాస్కరరావు దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు చింతా చిన్ని, చింతా నాంచారయ్య (పులి), చింతా కిషోర్‌, చింతా నాగమల్లేశ్వరరావు, చింతా వంశీకృష్ణ, కొల్లు రవీంద్రలను పోలీసులు అరెస్ట్ చేశారు. కొల్లు రవీంద్ర ప్రోద్బలంతోనే మోకా భాస్కరరావుని హత్య చేసినట్లు నిందితులు విచారణలో చెప్పారని పోలీసులు తెలిపారు. మోకా భాస్కరరావు హత్య కేసులో చింతా చిన్ని, చింతా నాంచారయ్య అలియాస్‌ పులి, చింతా కిషోర్‌ రక్త సంబంధీకులు. వీరు వరుసగా మొదటి నిందితులు కాగా నాలుగో నిందితునిగా కొల్లు రవీంద్ర ఉన్నారు.

READ  ఉద్యోగాల పేరుతో రూ.5 కోట్లు వసూళ్లు : టీడీపీ మాజీ మంత్రి మనవడు అరెస్ట్

chintha chinni

మోకా హత్య కేసు, అసలేం జరిగిందో చెప్పిన ఎస్పీ:
* నాంచారయ్య, భాస్కరరావు మధ్య విభేదాలే హత్యకు కారణం
* ఆధిపత్య పోరులోనే మోకా భాస్కరరావు హత్య
* కొల్లు రవీంద్రకు ముఖ్య అనుచరుడే నాంచారయ్య
* తన పేరు బయటకు రాకుండా చూడాలని కొల్లు రవీంద్ర కోరారు
* షిప్ మార్కెట్ లో రిపేర్ వర్క్స్ కోసం భాస్కరరావు వచ్చారని తెలిసి అటాక్ చేశారు
* బాడీలో ఎక్కడ పొడిస్తే చనిపోతారనే దానిపై నిందితులు ట్రైనింగ్ తీసుకున్నారు
* 2013 నుంచే భాస్కరరావుని చంపాలని ప్లాన్ చేశారు
* భాస్కరరావు హత్యకు 15 రోజుల ముందు కొల్లు రవీంద్రతో చర్చించారు
* అయితే ఇప్పుడే వద్దని నాంచారయ్యను కొల్లు రవీంద్ర వారించారు
* కొన్ని రోజుల తర్వాత మరోసారి నాంచారయ్య, కొల్లు రవీంద్ర మాట్లాడుకున్నారు
* హత్య చేస్తే తన పేరు బయటకు రాకూడదని కొల్లు రవీంద్ర చెప్పారు
* హత్య ప్లాన్ విఫలమైతే భాస్కరరావు మన అంతు చూస్తాడని చెప్పిన కొల్లు రవీంద్ర
* భాస్కరరావు హత్య కేసులో కొల్లు రవీంద్ర భాగస్వామి
* నిందితులపై 302, 109, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు

Related Posts