ఒక నేరం తప్పించుకోటానికి… మరో నేరం చేసి దొరికి పోయిన భార్యా భర్తలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

uttar pradesh:మనుషుల్లో ఈజీ మనీ కోసం…. సుఖాల కోసం నేరాలు చేయటం తేలిక అయిపోయింది. ఒకసారి తప్పుచేసి ఆ తప్పు చేయటానికి మరో తప్పు చేయటానికి కూడా నేరస్ధులు వెనుకాడటం లేదు. టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయి…వ్యవస్ధలు బలోపేతమైన ఈ రోజుల్లో నేరాలు చేయటం “అంత వీజి కాదని” నేరస్ధులు గుర్తించాలి.

ఉత్తర ప్రదేశ్ లో ఒక నేరస్ధుడు తాను చేసిన నేరం నుంచి తప్పించుకోటానికి మరో నేరం చేసాడు. ఈ సారి… ప్లాన్ లో భాగస్వామి అయిన భార్యతో సహా దొరికిపోయాడు. అత్యాచారం, హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఆ కేసు నుంచి బయటపడటానికి వేసిన ఈప్లాన్ లో అడ్డంగా బుక్కయిపోయాడు. పాతకాలపు సినిమా స్టోరీని తలదన్నేలా ఉన్న ఈ రియల్ కధ మీరు చదవండి.ఉత్తర ప్రదేశ్ లోని కుమార్ అనే వ్యక్తిపై గతంలో హత్య, అత్యాచారం కింద పలు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో శిక్ష పడి జైలు జీవితం అనుభవిస్తున్నాడు. ఎన్నాళ్ళీ జైలు జీవితం గడపాలి అనుకున్నాడు. కేసులు నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచించాడు. బెయిల్ పై బయటకు వచ్చాడు. కేసులు నుంచి బయటపడటానికి ఏం చేయాలా అని…… తన భార్యా, అనుచరులతో మీటింగ్ పెట్టాడు. మొత్తానికి ఓ ప్లాన్ వేశాడు.

తన పోలికలతో ఉన్న మనిషి కోసం వెతుకులాట మొదలెట్టారు. బులంద్ షహర్ లో తన పోలికలోతో ఉన్న వ్యక్తిని గుర్తించారు. అతడు మద్యానికి బానిసైన వ్యక్తిగా గుర్తించారు. ఎప్పడూ మద్యం మత్తులోనే ఉంటున్నట్లు తెలుసుకున్నారు. ఇంకేం తాను అనుకున్నది అమలు చేయటానికి సెప్టెంబర్ 23 మహూర్తం పెట్టుకున్నాడు కుమార్. ఆ రోజున బులంద్ షహర్ వెళ్లి మద్యం మత్తులో జోగుతున్న బాధితుడికి డబ్బులు ఇచ్చి మరింత మద్యం సేవించేలా ప్రోత్సహించాడు కుమార్. అ తర్వాత తన దుస్తులు వేసుకోమని కోరాడు. అందుకు అంగీకరించిన ఆ వ్యక్తి..కుమార్ చెప్పిన వెంటనే ఆ పని కూడా చేశాడు.కొద్ది సేపటికి అక్కడకు చేరుకున్న కుమార్ భార్య, అనుచరుడు కలిసి బాధితుడిని సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకు వెళ్లి హత్యచేశారు. ముఖం ఆనవాళ్లు లేకుండా బండరాయితో నుజ్జు నుజ్డు చేశారు. మృతదేహం జేబులో తన ఆధార్ కార్డు, ఇతర గుర్తింపు కార్డులు పెట్టాడు. అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. భార్య అనుచరుడు ఏమీ తెలియనట్లు ఇంటికి వెళ్లిపోయారు.ఈ నేపధ్యంలో అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని శవం ఉందని సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్ధలికి వెళ్లి విచారణ చేప్టటారు. మృతదేహాం వద్ద ఆధారాలతో కుమార్ ఇంటికి వచ్చి అతని భార్యను విచారించారు. పోలీసు విచారణలో కుమార్ భార్య నుంచి సరైన సమాధానాలు రాకపోవటంతో పోలీసులు ఆమెను తమదైన స్టైల్లో విచారించారు. దీంతో ఆమె కుమార్ వివరాలు చెప్పింది.

ఆమె ఇచ్చిన సమాచారం మేరకు కుమార్ ను ఆలీఘడ్ లో అరెస్ట్ చేశారు. అతడికి సహకరించిన భార్య, అనుచరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో తనపై ఉన్న నేరాలనుంచి తప్పించుకునేందుకు..తన స్ధానంలో మరో వ్యక్తిని హత్య చేసి తన గుర్తింపు మాయం చేసేందుకే కుమార్ ఈ ఘాతకానికి ఒడిగట్టి మరో నేరం చేసి భార్య అనుచరుడితో సహా జైలు పాలయ్యాడు.

Related Tags :

Related Posts :