సిద్ధిపేటలో డబ్బుల కలకలం, రఘునందన్ రావు మామ ఇంట్లో 18.65లక్షలు స్వాధీనం.. పోలీసుల చేతి నుంచి లాక్కెళ్లిన బీజేపీ కార్యకర్తలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Dubbaka బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న రఘునందనరావు మామ రామ్‌గోపాల్‌రావు ఇంటిపై పోలీసుల దాడి జరిగింది. ఈ దాడిలో 18.65లక్షల డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ డబ్బు దొరికిందనే వార్త వినగానే బీజేపీ కార్యకర్తలు ఒక్కసారిగా పోలీసుల మీదకు దాడికి దిగి డబ్బును లాక్కునేందుకు ప్రయత్నించారు.

ఒక్కొక్కరు కొంత చొప్పున డబ్బును పోలీసుల చేతి నుంచి లాగేసుకున్నారు. రామ్‌గోపాల్‌ ఇంటితో పాటు.. సిద్దిపేట మున్సిపల్ చైర్మన్‌, టీఆర్‌ఎస్‌కు చెందిన రాజనర్స్‌ ఇంట్లోనూ సోదాలు జరిగాయి.రామ్ గోపాల్ ఇంట్లో పోలీసులు, బీజేపీ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. దుబ్బాక ఉప ఎన్నిక‌కు న‌వంబ‌ర్ 3న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. నవంబరు 10న ఓట్ల‌ను లెక్కించ‌నున్నారు.

 

కొద్ది రోజుల క్రితం శామీర్‌పేట్‌లో పట్టుబడ్డ 40లక్షల రూపాయలు బీజేపీ అభ్యర్థి రఘునందనరావుకు చెందినవేనని తెలిసింది. మళ్లీ ఇప్పుడు మరో 18.65 లక్షల క్యాష్ కూడా బీజేపీ అభ్యర్థి స్వాధీనపరచుకోవడం గమనార్హం.

Related Tags :

Related Posts :