లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

దేశంలో ఆర్థికంగా జీహెచ్ఎంసీనే బెస్ట్‌

Published

on

GHMC

GHMC: ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ విషయానికొస్తే గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) దేశంలోని బెస్ట్ కార్పొరేషన్స్‌లో ఇంకా బెస్ట్ గానే ఉంది. లాక్‌డౌన్‌లో మేనేజ్మెంట్ పరంగా ఏఏ రేటింగ్ ఇచ్చాయి రెండు రేటింగ్ ఏజెన్సీలు. లాక్‌డౌన్ సమయంలో ఆదాయం రాకపోయినప్పటికీ.. రోడ్ పనులు వంటివి చకచకా చేసుకుంటూ పోయింది GHMC.

రోడ్ వర్క్స్, పలు జంక్షన్ల దగ్గర ఫ్లై ఓవర్స్ డెవలపింగ్ వంటివి చేపడుతూ.. జీహెచ్ఎంసీ వర్కర్లకు జీతాలు, పెన్షన్లు సకాలంలోనే అందించారు. ఇటీవల సంభవించిన వరదలు, సాధారణ ఎన్నికల కారణంగా జీహెచ్ఎంసీ రెవెన్యూపై ఫోకస్ పెట్టలేదు. ఫలితంగా వర్క్ బిల్స్ పేమెంట్ లో కాస్త జాప్యం జరిగింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత సెప్టెంబర్ 10 వరకూ బిల్స్ పేమెంట్ అయిపోయింది.

ఆ తర్వాత బిల్స్ ను దశల వారీగా క్లియర్ చేయాలని ప్లాన్ చేస్తుంది జీహెచ్ఎంసీ. ఈ మేరకు స్టేట్ గవర్నమెంట్ రూ.564.92కోట్లు జీహెచ్ఎంసీకి విడుదల చేసింది. ఏప్రిల్ నుంచి నవంబర్ వరకూ రూ.312కోట్లు, డిసెంబర్ నుంచి మార్చి 2021వరకూ రూ.78కోట్ల మొత్తాన్ని విడుదల చేసింది ప్రభుత్వం.