శ్రీరాముడికి మీసం ఉండాలని డిమాండ్.. కొట్టిపారేసిన ప్రధాన అర్ఛకులు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయోధ్య రామ మందిర శంకుస్థాపనకు ముందే హిందూ మత నాయకుడు శాంభాజిరావు భీడే గురూజీ కొత్త డిమాండ్ తెరమీదకు తెచ్చారు. శివప్రతిస్థాన్ హిందూస్థాన్ ను నిర్వహించే ఆక్టోజెనేరియన్.. అత్యధిక మందికి ప్రతీకగా మారిన ఛత్రపతి శివాజీ మహారాజ్ ను ప్రస్తావిస్తూ రామ భగవానుడికి కూడా మీసకట్టు ఉండాలని డిమాండ్ చేశారు.

రామ భగవానుడికి, లక్ష్మణుడికి కచ్చితంగా మీసకట్టు ఉండాలి. వయస్సు రీత్యా… వివాహుతుడైన క్షత్రియ కమ్యూనిటీలో మీసం తప్పనిసరిగా ఉంటుంది. దీని గురించి శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షఏత్ర ట్రస్టీ గోవింద్ గిరి మహారాజ్ తో కూడా చర్చించారట. ఆ విగ్రహాలకు ఒకవేళ మీసాలు లేకుండా ఉంటే దేవుడి గుడికి వచ్చే భక్తులకు విలువ ఉండదని అన్నారు.

నాశిక్ లో ఉన్న కళారామ్ మందిర్ గుడుల్లో రామ భగవానుడి, లక్ష్మణుడి విగ్రహాలకు మీసాలు ఉండాలని భీడె సపోర్టర్లు చెప్పుకొస్తున్నారు. సినిమాల్లో, టీవీ సీరియల్స్‌లో రామభగవానుడి గురించి ఫేసియల్ చేసి చూపించడం మొదలుపెట్టారు. అటువంటి లోపాలన్నింటినీ రామ జన్మభూమి అయోధ్యలో సరిదిద్దాలి.

అయోధ్యలోని రామ్ లల్లా గుడి ప్రధాన అర్చకుడు మహంత్ సత్యేంద్ర దాస్ ఈ డిమాండ్ ను కొట్టిపారేశారు. ఇటువంటి అంశాలు హిందూయిజంలో ఎటువంటి ప్రాధాన్యం లేనివని తేల్చేశారు. రామ, కృష్ణ, శివ లాంటి దేవుళ్ల విగ్రహాలను 16 సంవత్సరాల వయస్సులో ఉన్నట్లు రూపమిస్తారని తెలిపారు. ఆ వయస్సులో మీసాలు ఉండటమనేది ప్రాధాన్యత లేని అంశమని వివరించారు.

Related Posts