వృక్షాబంధన్ : చెట్లకు రాఖీలు కట్టి.. రక్షణగా ఉంటామని..విద్యార్ధుల ప్రతిజ్ఞ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఉత్తరప్రదేశ్ లోని మొరాబాద్‌లోని లోని విద్యార్థులు ‘సేవ్ ఎన్విరాన్‌మెంట్’, ‘సేవ్ ట్రీస్’, ‘సేవ్ లైఫ్’ సందేశాలతో చెట్లపై రాఖీలు కట్టి వినూత్నంగా రాఖీ పౌర్ణమి వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా శిల్పి సైనీ అనే విద్యార్థిని మాట్లాడుతూ పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు పర్యావరణంపై చెట్లకు రాఖీలు కట్టామని తెలిపింది. ‘పర్యావరణాన్ని, చెట్లను కాపాడండి.. జీవితాన్ని రక్షించండి’ అని చెప్పేందుకు కార్యక్రమం ద్వారా చెప్పాలనుకుంటున్నామని తెలిపింది.చెట్లు ప్రతి ఒక్కరికీ ఎంతో ఉపయోగమని పుష్పాంజలి సింగ్‌ అనే మరో విద్యార్థిని తెలపింది. జనాభా పెరుగుదలతో చెట్లను నరికివేస్తున్నారనీ..ఇది పర్యావరణానికి చాలా హాని చేస్తుందన్నారు. అందుకే మొక్కలను నాటి పచ్చదనాన్ని పరిరక్షించాల్సిన బాధ్య ప్రతీ ఒక్కరికీ ఉందని తెలిపింది. చెట్లను పరిరక్షించడం బాధ్యతగా మార్చుకోవాలనీ..‘రక్షాబంధన్ రక్షణకు చిహ్నంగా పిలువబడుతుందని, చెట్లను అలాగే రక్షించాలని కోరుకుంటున్నాం’ అని చెప్పింది.

Related Posts