గాలి కాలుష్యంతో 1.16 లక్షల నవజాత శిశువులు మృతి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

more-one-lakh-infants-died-from-air-pollution-in-india : గాలి కాలుష్యం ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రధానంగా చిన్న పిల్లలపై ఎఫెక్ట్ పడుతోంది. వాయు కాలుష్యం కారణంగా..వివిధ అనారోగ్య సమస్యలతో 2019 సంవత్సరంలో 1.16 లక్షలకు పైగా నెలలోపు వయస్సున్న శిశువులు (State of Global Air 2020) చనిపోయారు.



Sub-Saharan Africaలో 2,36,000 మంది ఉన్నారు. ఈ విషయాన్ని US-based హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్‌‌స్టిట్యూట్ (హెచ్‌‌ఈఐ1) అనే సంస్థ వెల్లడించింది. గాలి కాలుష్యం..పెద్దలతో పాటు..నవజాత శిశువులపై తీవ్ర ప్రభావం చూపుతోందని, శ్వాస సంబంధిత సమస్యలతో పాటు అస్తమా, ఊపరితిత్తుల క్యాన్సర్, అల్జీమర్స్, ఆటిజం లాంటి జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని తెలిపింది.



నవజాత శిశువులు మరణించడానికి కొన్ని కారణాలున్నాయని, కట్టెల పొయ్యి, పిడకలు, బొగ్గు కుంపట్లు వెలిగించడం ద్వారా వెలువడే కాలుష్యం కారణమన్నారు. అల్పాదాయ- మధ్య ఆదాయ దేశాల్లో నవజాత శిశువుల ఆరోగ్యం చాలా కీలకం.



వాయు కాలుష్యం కారణంగా తక్కువ బరువుతో పుట్టడం, ముందస్తు జననాలు, పిల్లల ఎదుగుదల లాంటి సమస్యలు కూడా వస్తున్నాయని తెలిపింది. 2019లో ప్రపంచ వ్యాప్తంగా వాయు కాలుష్యం వల్ల 6.7 మిలియన్ల మరణాలకు దారి తీసిందని, రక్తపోటు, పొగాకు వాడకం ఇతర కారణాలున్నాయని నివేదిక వెల్లడించింది.

Related Tags :

Related Posts :