వన్య ప్రాణులను హింసిస్తూ పోతే.. మరిన్ని వైరస్‌లు పుట్టకొస్తాయని హెచ్చరిస్తున్న సైంటిస్టులు!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

వన్యప్రాణాలను హింసిస్తూ పోతే.. కరోనా వైరస్ లాంటి మరెన్నో మహమ్మారులు పుట్టుకొస్తాయని హెచ్చరిస్తున్నారు సైంటిస్టులు.. వన్య ప్రాణుల సంరక్షించాల్సిన అవసరం ఉందని, అలాగే పర్యావరణాన్ని కూడా రక్షించుకోవాలని సూచిస్తున్నారు. వన్యప్రాణులను రక్షించుకోవాలని లేదంటే.. జంతువుల నుంచి ప్రాణాంతక వ్యాధులను కలిగించే వైరస్‌లు మనుషులకు వ్యాపించే ముప్పు తప్పదని గట్టిగా హెచ్చరిస్తున్నారు. జంతువుల ప్రోటీన్‌కు అధిక డిమాండ్, నిలకడలేని వ్యవసాయ పద్ధుతులతో పాటు వాతావరణ మార్పుల కారణంగా కోవిడ్-19 వంటి వ్యాధులు పెరిగిపోతున్నాయని అంటున్నారు.

వన్య ప్రాణాల సంరక్షణ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే జూనోటిక్ వ్యాధులు సంవత్సరానికి రెండు మిలియన్ల మందిని బలితీసుకుంటాయని హెచ్చరిస్తున్నారు. కోవిడ్-19 రెండు సంవత్సరాల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు (7.2tn ) పౌండ్ల ఖర్చు అవుతుందని అంటున్నారు. జంతువుల నుంచి మనుషులకు ఎందుకు ఎక్కువగా వ్యాపించే వ్యాధుల్లో ఎబోలా, వెస్ట్ నైల్ వైరస్, సార్స్ కూడా జూనోటిక్ వ్యాధులుగా తేల్చేశారు. జంతువుల్లో నుంచి వాటిని తినడం ద్వారా మనుషుల్లోకి వ్యాపిస్తున్నాయని చెబుతున్నారు.

నివేదిక ఏం చెబుతోంది? :
ఐక్యరాజ్య సమితి పర్యావరణం, అంతర్జాతీయ పశువుల పరిశోధన సంస్థ నివేదిక ప్రకారం.. పర్యావరణం క్షీణించడం, వాతావరణ మార్పుల కారణంగా కూడా ఇలాంటి మహమ్మారులు పుట్టుకోస్తాయని చెబుతోంది. గత శతాబ్దంలో కనీసం ఆరు ప్రధాన కరోనా వైరస్‌లను చూశామని యుఎన్ పర్యావరణ కార్యక్రమం అండర్ సెక్రటరీ జనరల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇంగెర్ అండర్సన్ అన్నారు. గత రెండు శతాబ్దాలుగా కోవిడ్-19కి ముందు జూనోటిక్ వ్యాధుల కారణంగా (80 బిలియన్ పౌండ్లు) అంటే.. 100 బిలియన్ డాలర్లు ఆర్థిక నష్టాన్ని కలిగించాయి.

More outbreaks if we keep exploiting wildlife

తక్కువ, మధ్య ఆదాయ దేశాలలో రెండు మిలియన్ల మంది ప్రజలు నిర్లక్ష్యం చేసిన స్థాని జూనోటిక్ వ్యాధులైన ఆంత్రాక్స్, బోవిన్ క్షయ, రాబిస్ వంటి వాటితో మరణిస్తున్నారని ఆమె అన్నారు. తరచూ సంక్లిష్ట అభివృద్ధి సమస్యలు, పశువుల మీద ఎక్కువ ఆధారపడటం, వన్య ప్రాణులను హింసించి వాటి మాంసాన్ని ఉత్పత్తి చేస్తున్నారని చెప్పారు.

మాంసం ఉత్పత్తి గత 50 ఏళ్లలో 260 శాతం పెరిగిందని ఎంఎస్ అండర్సన్ చెప్పారు. కేవలం వన్య ప్రాణాలే కాదు.. నీటి పారుదల, ప్యాక్టరీల ద్వారా వ్యర్థాల ద్వారా కూడా 25 శాతం మేర అంటువ్యాధులు ప్రబలే ముప్పు ఉందని అంటున్నారు. అందులోనూ వాతావరణ మార్పు వ్యాధికారక వ్యాప్తికి దోహదపడిందని చెప్పారు. జీవ వైవిధ్యాన్ని మెరుగుపరచడం, శాస్త్రీయ పరిశోధనలలో పెట్టుబడులు పెట్టడం వంటి భవిష్యత్తులో వ్యాప్తి చెందకుండా ఎలా నిరోధించాలనే దానిపై ప్రభుత్వ వ్యూహాలను నివేదిక అందిస్తుందని అన్నారు.

READ  క్వారంటైన్ టిప్స్ కావాలంటే చెప్తా...విడుదల తర్వాత ఒమర్ అబ్దుల్లా ట్వీట్

వన్య ప్రాణులను నాశనం చేస్తూ.. మన పర్యావరణ వ్యవస్థలను దెబ్బతీస్తూ పోతే ఈ వ్యాధులు జంతువుల నుంచి మానువులకు రాబోయే సంవత్సరాల్లో మరింత విజృంభించి వినాశనం జరుగొచ్చునని అండర్సన్ హెచ్చరించారు.

Related Posts