జనవరి నాటికి భారత్ లో 1.4 కోట్లకు పైగా కరోనా కేసులు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

corona cases in India : వచ్చే ఏడాది జనవరి కల్లా భారతదేశంలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరిగే ప్రమాదం ఉందని ఓ అధ్యయనం అంచనా వేసింది. గతంతో పోలిస్తే ఇటీవలి కాలంలో కేసుల గ్రాఫ్ తగ్గుతున్నప్పటికీ రాబోయే రోజుల్లో 81 వేల చొప్పున కొత్త కేసులు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.

కాన్పూర్ ఐఐటీకి చెందిన భౌతికశాస్త్రం ప్రొఫెసర్ మహేంద్ర వర్మ నేతృత్వంలోని టీమ్ చేపట్టిన మ్యాథమెటికల్ అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడించింది.
యూరప్ లోని 8 దేశాల్లో నమోదైన కేసుల డేటాతో సరిపోల్చి మ్యాథమెటికల్ పద్ధతిలో గణాంకాలను విశ్లేషించారు. ఫ్రాన్స్, ఇటలీ, స్విట్జర్లాండ్, టర్కీ, నెదర్లాండ్స్, బెల్జియం, జర్మనీలలో నమోదైన గణాంకాల ఆధారంగా విశ్లేషించి అంచనా వేసినట్లు మహేంద్ర వర్మ తెలిపారు.భారత్ లో సెప్టెంబర్ 22 వరకు నమోదైన కేసులను ప్రామాణికంగా తీసుకున్నామని, అప్పటికి ప్రపంచ గ్రాఫ్ తో దాదాపు సమాంతరంగా ఉండేదన్నారు. ఈ గణాంకాల ఆధారంగా భారత్ లో 2021 జనవరి 1 వరకు కేసుల ట్రెండ్ ఎలా ఉండబోతోందనేది అంచనా వేసినట్లు వివరించారు.అయితే భారత్ లో ప్రస్తుతం రోజువారీ కేసులు తగ్గుతున్నాయని, ప్రజలు కోవిడ్ నిబంధనలను పాటించకపోతే మాత్రం మరింతగా విజృంభిస్తుందని ఆయన హెచ్చరించారు. 2021 జనవరి 1వ తేదీ నాటికి మొత్తం కేసుల సంఖ్య 14.57 మిలియన్లకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.అలాగే భారత్ హెర్డ్ ఇమ్యూనిటీకి చేరువయ్యే అవకాశం ఉందని, ఇప్పటికే 38 కోట్ల మంది ప్రజలు కరోనా వైరస్ కు గురికావడమో, వారిలో యాంటీబాడీలు ఉండటమో జరిగిందని డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సంస్థ చేపట్టిన సూపర్ మోడల్ అంచనా వేసింది. 2021 నాటికి భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి 10.6 మిలియన్లకు చేరే అవకాశం ఉందని పేర్కొంది.మరోవైపు భారత్ లో కరోనా కేసులు తగ్గినట్లే కనిపించి మళ్లీ పెరుగుతున్నాయి. ఇటీవల రోజుకు 36 వేల కేసులకు పడిపోయినప్పటికీ మళ్లీ గత 24 గంటల్లో 48 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 80.88 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 1.21 లక్షల మంది మృతి చెందారు. 73.73 లక్షల మందికి పైగా కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.ప్రస్తుతం భారత్ లో 5.94 లక్షల క్రియాశీల కేసులు మాత్రమే ఉన్నాయి. భారత్ లో పండుగ సీజన్ కావడానికి తోడు చలికాలం మొదలుకావడంతో ఈ కేసులు పెరిగే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం కూడా అంచనా వేస్తోంది.అందుకే ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని పదే పదే చెబుతోంది. ఢిల్లీతోపాటు పశ్చిమబెంగాల్, కేరళ రాష్ట్రాల్లో రోజువారీ కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే.

Related Tags :

Related Posts :