విటమిన్ D లోపంతోనే 80శాతానికి పైగా కరోనా బాధితులు ఆస్పత్రి పాలయ్యారు.. కొత్త అధ్యయనం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Vitamin-D deficiency కరోనా బాధితుల్లో చాలామందిలో విటమిన్ D లోపం కారణంగా ఆస్పత్రి పాలయ్యారని ఓ కొత్త అధ్యయనం వెల్లడించింది. స్పెయిన్ ‌లోని ఓ ఆస్పత్రిలో విటమిన్ డి లోపమున్న 80 శాతానికి పైగా కరోనా బాధితులు ఆస్పత్రి పాలయ్యారని అధ్యయనంలో తేలింది.శాంటాండర్‌లోని University Hospital Marques de Valdecillaకు చెందిన పరిశోధకులు కరోనా బాధితులపై అధ్యయనం చేశారు.

మార్చి 10 నుంచి మార్చి 31 మధ్య కాలంలో కరోనా చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన 216 మంది పేషెంట్లలో విటమిన్ D స్థాయిలపై పరిశోధకులు అధ్యయనం చేశారు.అదే ప్రాంతంలో నివసిస్తున్న ఒకే వయస్సు వారిలో విటమిన్ డి అదుపులో ఉన్న 197 మంది కరోనా బాధితులతో పోలిస్తే.. ఆస్పత్రిలో చేరిన 216 మంది కరోనా బాధితుల్లో విటమిన్ డి లోపం ఉందని పరిశోధకులు గుర్తించారు.వీరిలో 19 మంది నోటి ద్వారా విటమిన్ డి సప్లిమెంట్లను మూడు నెలలకు పైగా తీసుకున్నవారిని ప్రత్యేకంగా పరిశోధకులు అధ్యయనం చేశారు.

ఆస్పత్రిలో చేరిన కరోనా బాధితుల్లో 82 శాతం మందిలో (సప్లిమెంట్ తీసుకోనివారు) విటమిన్ డి లోపం ఉందని గుర్తించారు.మరోవైపు కంట్రోల్డ్ గ్రూపులో 47 శాతం మందిలో ఒకే రకమైన లోపం ఉందని గుర్తించారు. కోవిడ్ సోకిన మహిళలతో పోలిస్తే.. పురుషుల్లోనే విటమిన్ డి లోపం అధికంగా ఉందని అధ్యయనం పేర్కొంది.కరోనా ఇన్ఫెక్షన్లను నిరోధించడంలో విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తుందని ఇప్పటికే కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది.

ఇదివరకే గుండె జబ్బులు, డయాబెటిస్, కేన్సర్, ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు అధికంగా ఉన్నవారిలో విటమిన్ డి లోపం అధికంగా ఉందని గుర్తించారు.

Related Tags :

Related Posts :