లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story

సగం మంది రైతులకు కొత్త వ్యవసాయ చట్టాల గురించి తెలీదంట

Published

on

farm laws: వ్యవసాయంలో సంస్కరణల పేరుతో మోడీ ప్రభుత్వం ఇటీవల మూడు నూతన వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు,విపక్షాలు పెద్ద ఎత్తున నిరసలు కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా పంజాబ్,హర్యానా రాష్ట్రాల్లో అయితే నిరసనలు మిన్నంటాయి. మరోవైపు,పలువురు మేధావులు,నాయకులు, కొన్ని పార్టీలు ఈ వ్యవసాయ చట్టాలను… రైతుల జీవితాల్లో వెలుగులు నింపేవిగాను,రైతును ధనవంతుడిని చేసేవిగాను వర్ణిస్తున్నాయి.
అయితే, అసలు కేంద్రం తీసుకొచ్చిన 3 కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్న,సమర్థిస్తున్న రైతుల్లో 52 శాతం మందికి అసలు వాటి గురించి ఎలాంటి వివరాలు తెలియదని ఓ సర్వేలో తేలింది. కొత్త వ్యవసాయ చట్టాలపై భారతీయ రైతుల అవగాహన పేరిట ‘గావ్ కనెక్షన్’ ఈ సర్వే నిర్వహించింది. అక్టోబర్ 3-9 తేదీల మధ్య దేశంలోని 16 రాష్ట్రాల్లో ఈ సర్వే నిర్వహించారు. 53 జిల్లాలో 5,022 మంది రైతులతో ముఖాముఖి సర్వే చేశారు. ఈ వివరాలను ‘ది రూరల్ రిపోర్ట్ 2’ పేరిట విడుదల చేశారు.

కరోనా ప్రమాదం ఇంకా ఉంది….మోడీ


మొత్తంగా 52 శాతం మంది రైతులు ఈ చట్టాలను వ్యతిరేకించగా.. 35 శాతం మంది సమర్థిస్తున్నట్లు ఈ సర్వే ద్వారా తెలిసింది. కేంద్రప్రభుత్వం…రైతులకు అండగా ఉందని 35 శాతం మంది చెబితే.. ప్రైవేటు లేదా కార్పొరేట్ సంస్థలకు మద్దతిస్తోందని 20 శాతం మంది రైతులు చెప్పినట్లు సర్వే వెల్లడించింది.
చట్టాలను వ్యతిరేకించిన 52 శాతం మంది రైతుల్లో 36 శాతం మంది వద్ద చట్టాలపై సమాచారం లేదని సర్వేలో తేలింది. అదేవిధంగా చట్టాలను సమర్థిస్తున్న35 శాతం మంది రైతుల్లో 18 శాతం మంది రైతులకు ఈ చట్టాల గురించి తెలియదని తేలింది. 5 ఎకరాలలోపు భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతుల్లో ఎక్కువ మంది ఈ చట్టాలను స్వాగతిస్తున్నారు. మధ్యస్థాయి, పెద్ద రైతులు ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్నారు.

మోడీ ప్రభుత్వం రైతు అనుకూల ప్రభుత్వమని 44 శాతం మంది రైతులు అభిప్రాయపడగా.. 28 శాతం మంది రైతు వ్యతిరేక ప్రభుత్వమని చెప్పారు. మోడీ ప్రభుత్వం రైతులకు మద్దతుగా ఉందని 35 శాతం మంది చెబితే.. ప్రైవేటు లేదా కార్పొరేట్ సంస్థలకు అండగా ఉందని 20 శాతం మంది రైతులు తెలిపారు.
కనీస మద్దతు ధరను తప్పనిసరి చేస్తూ దేశంలో చట్టం తీసుకురావాలని 59 శాతం మంది రైతులు అభిప్రాయపడ్డారు. ఈ చట్టం అమలులోకి వస్తే.. కనీస మద్దతు ధర వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేస్తుందని 33 శాతం మంది ఆందోళన చెందుతున్నట్లు సర్వేలో తేలింది.

వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల గురించి మూడింట రెండొంతుల మంది రైతులకు అవగాహన ఉందని సర్వే తెలిపింది. పంజాబ్, హరియాణా, హిమాచల్​ప్రదేశ్ రాష్ట్రాల్లోని రైతుల్లో 91 శాతం మందికి నిరసనల గురించి తెలుసని సర్వే వెల్లడించింది. కాగా, పశ్చిమ్ బంగ, ఒడిశా, ఛత్తీస్​గఢ్​లో కనిష్ఠంగా 46 శాతం మంది రైతులకే ఆందోళనలపై అవగాహన ఉందని తెలిపింది.

అసలు 3 నూతన వ్యవసాయ బిల్లులలో ఏముంది

1. రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) బిల్లు-2020
రైతులు… తమ ఉత్పత్తులను ప్రభుత్వ ఆమోదిత APMC(Agricultural produce market committee) మార్కెట్​ బయట లేదా వెలుపల విక్రయించుకోవడానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. రైతులకు సులభమైన ప్రత్యామ్నాయ మార్కెటింగ్​ మార్గాలను కల్పించడం దీని ఉద్దేశం అని ప్రభుత్వం తెలిపింది. ఈ చట్టం ప్రకారం రైతులు తమ ఉత్పత్తులను విక్రయించడం వల్ల వారి నుంచి ఎలాంటి సెస్​ను గానీ పన్నులనూ వసూలు చేయరు.
కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతోంది
మార్కెటింగ్​ ఖర్చులు తగ్గుతాయి. రైతులు ఇష్టమైన మార్కెట్​ను ఎంపిక చేసుకోవచ్చు. మంచి ధరలను రైతులు పొందవచ్చు. మిగులు ఉత్పత్తి ఉన్న ప్రాంతాల రైతులు కొరత ఉన్న ప్రాంతాల్లో సరఫరా చేసి మెరుగైన ధరలు పొందవచ్చు. మూడు చట్టాలతో రైతులకు వ్యవసాయంలో కొత్త స్వాతంత్ర్యం లభించింది. ఈ చట్టం ఉందని వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేయడం మానదు. కనీస మద్దతు ధర ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉంటుందని కేంద్రం చెబుతోంది.
విపక్షాల ఆందోళన ఎందుకు
ప్రభుత్వామోదిత మార్కెట్​ లో రైతులు తమ ఉత్పత్తులను విక్రయించకపోవడం వల్ల రాష్ట్రాలు ఆదాయాన్ని కోల్పోతాయి. మార్కెట్లో అమ్మకాలు లేకపోవడం వల్ల కమిషన్ ఏజెంట్లు నష్టపోతారు. కనీస మద్దతు ధర(MSP) ఆధారిత సేకరణ వ్యవస్థ ముగింపునకు.. ఈ చట్టం దారి తీస్తుంది. ప్రైవేట్ సంస్థల దోపిడీకి అవకాశం పెరుగుతుందని విపక్షాలు చెబుతున్నాయి.

2. రైతుల సాధికారత, రక్షణ, వ్యవసాయ సేవల బిల్లు- 2020
పెద్ద రిటైలర్లు, అగ్రికల్చర్​ బిజినెస్​ సంస్థలు, టోకు వ్యాపారులు, ఎగుమతిదారులతో రైతులు నేరుగా ఒప్పందం కుదుర్చుకోవడానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది.

కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతోంది
రైతులకు కొత్త టెక్నాలజీని అందిచవచ్చు. ఈ విధానాన్ని అనుసరించడం వల్ల మార్కెటింగ్​ ఖర్చు తగ్గుతుంది. రైతుల ఆదాయం పెరుగుతుంది.
విపక్షాలు ఏమంటున్నాయి
వ్యవసాయ రంగంలో ఆధిపత్యం చెలాయించే బడా సంస్థలకు అనుకూలంగా ఈ చట్టం రూపొందించబడింది. రైతుల శక్తిని బలహీన పరుస్తుంది. ప్రైవేటు సంస్థలు, ఎగుమతిదారులు, టోకు వ్యాపారులకు ఇది లాభం చేకూరుస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

3.అత్యవసర వస్తువుల సవరణ బిల్లు-2020
ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు వంటి ఉత్పత్తులను అత్యవసర వస్తువుల(ఎసెన్షియల్ కమోడిటీస్)లిస్ట్ నుంచి తొలగించాలని ఈ సవరించిన ఈ చట్టం చెబుతుంది. యుద్ధం, కరువు లాంటి పరిస్థితుల్లో ఈ వస్తువులపై పరిమితులు ఎత్తివేయాలని నిర్దేశిస్తుంది.
కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతోంది
వ్యవసాయ రంగంలోకి ప్రైవేటు పెట్టుబడులను తీసుకురావడం వల్ల ధర స్థిరత్వాన్ని తీసుకురావడం దీని ఉద్దేశమని ప్రభుత్వం చెబుతోంది. వ్యవసాయంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఇది దోహదపడుతుంది.

ప్రతిపక్షాలు ఏమంటున్నాయి
వస్తువుల నిల్వకు పెద్ద కంపెనీలకు స్వేచ్ఛ ఉంటుంది. చిన్న,సన్నకారు రైతులు తమ పంటను నిల్వ చేసుకోలేరు. ఇది రైతులను నియంత్రిస్తుంది.Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *