Home » ప్రపంచంలో కార్లన్నీ ఈ 4 రంగుల్లోనే ఎందుకు ఉంటాయో తెలుసా?
Published
2 months agoon
Most Cars Painted One of These Four Colors : ప్రపంచ మార్కెట్లోకి రోజురోజుకీ ఎన్నోకొత్త కార్లు దిగుతున్నాయి. సేఫ్టీ ఫీచర్లతో అత్యాధునిక టెక్నాలజీ, మెరుగైన ఫ్యుయల్ మైలేజ్‌తో వస్తున్నాయి. అయితే చాలా ఏళ్ల నుంచి దాదాపు అన్ని కార్లలో ఒకే రకమైన రంగుల్లో మార్కెట్లోకి వస్తున్నాయి. కేవలం నాలుగు రంగుల్లో మాత్రమే పెయింట్ వాడుతున్నాయి కార్ల కంపెనీలు. ఎందుకో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా కార్ల కంపెనీలు వైట్, బ్లాక్, గ్రే, సిల్వర్ రంగులనే పెయింట్‌గా వాడుతున్నాయి. ఇలా చేయడాన్ని కోటింగ్స్ ఇండస్ట్రీ ‘achromatic’ అని పిలుస్తుంది. ప్రపంచంలో 39 శాతం కార్లు వైట్ కలర్లలోనే ఉంటాయని BASF కోటింగ్స్ కంపెనీకి చెందిన 2019 డేటా వెల్లడించింది.
అంటే దీనిర్థం.. 80 శాతం వరకు అన్ని కార్లలో (achromatic lacquer) ఈ రకమైన రంగుల పెయింట్లనే వాడుతున్నాయి. వీటిలో కార్ల పెయింట్ కలర్లలో అత్యంత పాపులర్ chromatic కలర్.. బ్లూ కలర్. దాదాపు 9 శాతం కార్లు ఈ రంగులోనే మార్కెట్లోకి వస్తున్నాయి. మరో 7 శాతం కార్లు రెడ్ కలర్ పెయింట్ తో వస్తున్నాయి. ఎందుకు ఈ నాలుగు రంగుల్లోనే కార్లకు పెయింట్ గా వేస్తున్నారంటే అందుకు ఒక కారణం ఉందంటున్నారు కోటింగ్స్ ఇండస్ట్రీ నిపుణులు. రిస్క్ ఎవర్స్ డీలర్స్ ఎక్కువగా ఈ పాపులర్ కలర్లనే ఎక్కువగా స్టాక్ చేస్తుంటారు.
అత్యంత పాపులర్ రంగులను నిల్వ చేయడానికి వీలుగా ఉంటుంది. తద్వారా అసాధారణ రంగుల మొత్తం సరఫరాను పరిమితం చేసే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. వేర్వేరు రంగులతో మార్కెట్లోకి కార్లను ప్రవేశపెడితే రీసేల్ ప్రాముఖ్యత తగ్గిపోతుందనే కారణం కావొచ్చు అంటున్నారు. కానీ కోటింగ్ తయారీదారులు గణాంకాలు చూపించే దానికంటే ప్రస్తుత కార్ల రంగులు చాలా సూక్ష్మంగా, వైవిధ్యంగా ఉన్నాయని చెబుతున్నారు. తెలుపు కాదు, నలుపు, బూడిద లేదా వెండి ఏకరీతి రంగులు కాదు. కోటింగ్ అన్ని రకాలుగా వినియోగించుకోవచ్చు. మెటల్ ఫ్లేక్ లేదా గ్లాస్ లేదా మైకా బిట్స్ వంటి ప్రభావాలను కలర్ షేడ్స్‌ను కూడా సర్దుబాటు చేయవచ్చు.
తెలుపు రంగుకు కొద్దిగా నీలిరంగు రంగును జోడించడం కలర్ మారిపోతుంది. కొంచెం పసుపు తెలుపు రంగు కోటింగ్ వాడితే లగ్జరీ లుక్ కనిపిస్తుంది. మిక్స్ కలర్ కాంబేషన్ కూడా కార్లలో ఎక్కువగా ఉంటాయి. కాకపోతే ఈ మార్పులు చాలా సూక్ష్మంగా ఉంటాయి. కస్టమర్ల అవగాహన బట్టి ఆ రంగుల మార్పులను అంచనా వేయొచ్చు. మార్కెట్లో కార్లపై కస్టమర్లు ఎలాంటి రంగులను కోరుకుంటున్నారు అనేదానిపై కార్ల తయారీదారులకు నిర్దిష్టమైన అంచనా ఉంటుంది. దాని ప్రకారమే కారు మేకర్లు రంగుల ఎంపిక చేసుకుని కస్టమర్లను ఆకర్షించేలా తీర్చిదిద్దుతుంటారు. అట్రాక్టివ్ లుక్ కనిపించాలంటే ఎలాంటి రంగు వాడితే బాగుంటుంది అనేది నిర్ణయిస్తారు. అది కూడా ఈ నాలుగు రంగుల్లోనే కార్లపై పెయింట్ వాడతారంట..