పైసలిస్తే చాలు, ఎవరి ప్రాణమైనా తీస్తారు.. డేంజరస్ సుపారీ కిలర్స్.. అసలు సుపారీ అంటే ఏంటి..? తెలుగు రాష్ట్రాల్లోకి ఈ కల్చర్ ఎలా పాకింది

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

supari killers: సుపారీ కల్చర్‌ తెలుగు రాష్ట్రాలకూ పాకిందా..? పైసలిస్తే ప్రాణం తీసే కిల్లర్స్‌ ఏపీ, తెలంగాణలో సిద్ధంగా ఉన్నారా..? అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. నాటి ప్రణయ్‌ నుంచి నేడు హేమంత్ వరకు..ఓ సుపారీ హత్య ఘటన మరవకముందే మరో సుపారీ మర్డర్‌ వెలుగులోకి వస్తూనే ఉంది. ఇంతకీ..సుపారీ అంటే ఏంటి..? తెలుగు రాష్ట్రాల్లోకి ఈ సుపారీ కల్చర్ ఎలా విస్తరించింది..?

తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తోన్న సుపారీ కల్చర్‌.. పరువు, ఆర్థిక లావాదేవీలు, కుటుంబకలహాలు.. సన్నిహితులు, నా అనుకున్న వాళ్లే ప్రాణాలు తీయిస్తున్న వైనం.. ఆర్థిక స్థోమతను బట్టి లక్షల నుంచి కోట్లలో డీల్‌..
ఓ ఘటన మరవకముందే మరో ఘటన..

ఒకప్పుడు ముంబై, ఢిల్లీ, యూపీ, బీహార్ లాంటి ప్రాంతాలకే పరిమితమైన సుపారీ గ్యాంగ్స్ కల్చర్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోకి ఎంటరైంది:
గతంలో ముంబై, ఢిల్లీ, యూపీ, బీహార్ లాంటి ప్రాంతాలకే పరిమితమైన సుపారీ గ్యాంగ్స్ కల్చర్..ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోకి ఎంటరైంది. అంతేకాదు సన్నిహితులు..నా అనుకున్న వాళ్లే ఇలాంటి దారుణాలకు
తెగబడుతుండటం కలకలం రేపుతోంది. గత రెండేళ్లుగా చూసుకుంటే…ఓ ఘటన మర్చిపోయే లోపే..మరో ఘటన వెలుగులోకి వస్తూనే ఉంది. సంచలనం రేపుతున్న ప్రతీ మర్డర్ కేసులో సుపారీ గ్యాంగ్సే బయటపడుతున్నాయి. విజయవాడ మహేశ్ మర్డర్ కేసుతో..మరో సుపారీ గ్యాంగ్ బయటకొచ్చింది. ఇదే..ఇప్పుడు బెజవాడలో కలకలం రేపుతోంది. అయితే..మహేశ్‌ని చంపింది సుపారీ గ్యాంగ్ కాకపోయినా..ఈ కేసుతోనే ఓ సుపారీ గ్యాంగ్ వెలుగులోకి వచ్చింది.

నాడు ప్రణయ్, నేడు హేమంత్:
ఇక 2018లో మిర్యాలగూడ ప్రణయ్‌ని కూడా సుపారీ గ్యాంగే హతమార్చింది. పరువు పేరుతో అమృత తండ్రి మారుతీరావు..బీహార్‌ గ్యాంగ్‌ తో ప్రణయ్‌ను హత్య చేయించాడు. ఈ ఘటన అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. సేమ్‌ టు సేమ్‌..ఇలాంటే ఘటనే ఇటీవల..హైదరాబాద్‌లో వెలుగు చూసింది. గచ్చిబౌలిలో జరిగిన హేమంత్ హత్య కూడా..సుపారీ గ్యాంగ్ పనే. ఈ కేసులో స్థానిక కూలీలే 10 లక్షలకు ఆశపడి కిరాయి హంతకులుగా మారారు. ఈ కేసులోని నిందితుల్లో కొందరు రౌడీషీటర్లు కూడా ఉన్నారు. నాడు ప్రణయ్‌ హత్య ఎంత సంచలనం సృష్టించిందో..హేమంత్‌ హత్య కూడా అంతే సంచలనంగా మారింది.

భార్యను చంపేందుకు భర్త సుపారీ:
ఈ రెండు ఘటనలే కాదు..ఈ రెండు సుపారీ హత్యల మధ్య కాలంలో..ఆ తర్వాత ఎన్నో సుపారీ హత్యలు జరిగాయి. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ సుపారీ గ్యాంగ్ గుట్టు బయటపడింది.
కుటుంబకలహాలతో కట్టుకున్న భార్యనే కడతేర్చాలనుకున్నాడు ఓ కిరాతకుడు. భార్య రజితను చంపేందుకు సుపారీ గ్యాంగ్‌కు 3 లక్షలు అడ్వాన్స్‌ ఇచ్చాడు వేముల అశోక్‌. అయితే భర్త కుట్రను తెలుసుకున్న రజిత
పోలీసులకు ఫిర్యాదు చేయడంతో…దారుణం జరగకముందే గ్యాంగ్‌ సభ్యుల భరతం పట్టారు పోలీసులు.

ఈ ఏడాదిలోనే రెండు సుపారీ మర్డర్లు:
ఇక నల్గొండ జిల్లాలో ఈ ఏడాదే రెండు సుపారీ మర్డర్‌లు జరిగాయి. ఓ వివాహేతర సంబంధం ముగ్గురి ప్రాణాలను బలితీసుకుంది. అనుముల మండలం హజారీగూడెంలో నెలల వ్యవధిలోనే జరిగిన మూడు
హత్యలు.. అక్కడి జనాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. ఫిబ్రవరి 5న మొదటి హత్య జరగ్గా..దానికి ప్రతీకారంగా ఆగస్ట్ 3న జంట హత్యలు జరిగాయి. ఈ దారుణ హత్యలు.. పచ్చని పల్లెలో అలజడి రేపాయి.

ఒకప్పుడు ఉత్తరాదికే పరిమితం, ఇప్పుడు నెల్లూరులోనూ విస్తరణ:
అటు…నెల్లూరు జిల్లా కూడా నేరాలకు కేంద్రబిందువుగా మారుతోంది. ఇక్కడ కూడా సుపారీ గ్యాంగ్స్ కల్చర్ వేగంగా విస్తరిస్తోంది. ఒకప్పుడు ఉత్తరాది రాష్ట్రాలకే పరిమితమైన సుపారీ గ్యాంగ్ కల్చర్..ఇప్పుడు
నెల్లూరులో చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఒకప్పుడు..కిరాయి హంతకులంటే..ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి నేరాలకు పాల్పడేవారు. కానీ..ఇప్పుడు జిల్లాలోనే హంతకులు దొరుకేస్తున్నారు.

చాలా పక్కాగా సుపారీ గ్యాంగ్‌ల యాక్షన్‌ ప్లాన్‌లు:
ఈ సుపారీ గ్యాంగ్‌ల యాక్షన్ ప్లాన్లు కూడా చాలా పక్కాగా ఉంటాయి. సుపారీ ఇచ్చిన వ్యక్తితో..మనీ ట్రాన్సాక్షన్స్ తప్ప..యాక్షన్ ప్లాన్ ఏంటో చెప్పరు. 2, 3 నెలల ముందే..హత్యకు ప్లాన్ చేస్తారు. చంపాలనుకున్న వ్యక్తి ఏరియాలో రెక్కీ చేస్తారు. కుటుంబసభ్యులతో కనెక్ట్ అయ్యేందుకు స్కెచ్ వేస్తారు. స్థానిక సెక్యూరిటీ సిబ్బందిని వాడుకుంటారు. ఫేక్ నెంబర్ ప్లేట్లు ఉన్న వాహనాలు వాడతారు. ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ కార్డులు కొంటారు. ఆపరేషన్ అయ్యేవరకు..బేసిక్ ఫోన్లనే వాడతారు. ఒకవేళ పోలీసులకు దొరికినా.. బెయిల్, కోర్టు ఖర్చులు కూడా సుపారీ ఇచ్చినోళ్లే భరించేలా డీల్ చేసుకుంటుంటారు.

డబ్బు కోసమే ప్రాణాలు తీస్తారు:
ఇక సుపారీ గ్యాంగ్‌ సభ్యులకు చనిపోయిన వాళ్లతో ఎలాంటి సంబంధం ఉండదు. పగలు, ప్రతీకారాలే కాదు..కనీసం పరిచయం కూడా ఉండదు. కేవలం..డబ్బు కోసమే ప్రాణాలు తీసేస్తారు. డబ్బులిస్తే
చాలు.. ఎవరినైనా హతమార్చే సుపారీ కిల్లర్స్..తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోతున్నారు. పరువు, ప్రతిష్టలు, ఆర్థిక లావాదేవీలు, వ్యక్తుల మధ్య గొడవలను అవకాశంగా తీసుకుని..నిండు ప్రాణాలు తీసేందుకు లక్షల్లో డీల్స్
కుదుర్చుకుంటున్నారు. కనీసం 10 లక్షల నుంచి కోట్ల వరకు డీల్స్ మాట్లాడుకుంటూ హత్యలు చేస్తున్నారు. మరి తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్న ఈ సుపారీ కల్చర్‌కు పోలీసులు ఎలా ఫుల్‌స్టాప్‌ పెడతారో చూడాలి.

Related Tags :

Related Posts :