మోస్ట్ ఎలిజబుల్ కాంట్రవర్సీ: అఖిల్ మీద కాలుపెట్టి సెక్సీ అంటారా..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మోస్ట్ ఎలిజబుల్ మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్‌లో అఖిల్ అక్కినేని పెట్టిన ఫోజ్ వైరల్ అయింది. అంతే రేంజ్ లో కాంట్రవర్సీగానూ మారింది. అఖిల్ చెవిని కాళ్లతో టచ్ చేస్తూ ఉన్న స్టిల్ అది. కొందరి నుంచి మాత్రమే ఫిల్మ్ డైరక్టర్ భాస్కర్ క్రియేటివిటీకి ప్రశంసలు దక్కాయి. అక్కినేని అభిమానులతో పాటు మరికొందరు విమర్శలకు దిగుతున్నారు.

అఖిల్ వదిన సమంతా కూడా పోస్టర్ పై సైలెన్స్ మెయింటైన్ చేయడంపై విమర్శిస్తున్నారు నెటిజన్లు. కూల్ అండ్ సైలిష్ పోస్టర్ పై ట్విట్టర్ మొత్తం అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. చాలా మంది పూజా పోజ్ కు హర్ట్ అవుతున్నారు. అఖిల్ అన్న నాగ చైతన్య భార్య సమంతా.. 2014లో మహేశ్ బాబు సినిమా వన్ నేనొక్కడినేపై అప్పట్లో రిగ్రెసివ్ అంటూ కామెంట్లు చేశారు.

వన్ నేనొక్కడినే హీరోయిన్ కృతి సనన్.. బీచ్ లో నడుస్తూ.. మహేశ్ బాబు కాలిని వెనకనుంచి పట్టుకోవడానికి ప్రయత్నించింది. ఆ సమయంలో సమంతా చేసిన కామెంట్లకు ఆమెపై విమర్శలు చేశారు. అప్పుడు రిగ్రెసివ్ అని కామెంట్ చేసిన సమంతా ఇప్పుడు సైలెన్స్ గా ఎందుకు ఉంటుంది అని నెటిజన్లు అడుగుతున్నారు.

Related Posts