sexual-HARRASMENTS

కూతుళ్ల విషయంలో అడ్డొచ్చిందని తల్లిని చావబాదిన నలుగురు కిరాతకులు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Sexual Harassment: ఉత్తరప్రదేశ్ లో జరిగిన మరో ఘటనలో నలుగురు వ్యక్తులు కలిసి ఓ మహిళను చావబాదారు. మన్సూర్‌పూర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని నారా గ్రామంలో తన కూతుళ్ల విషయంలో అడ్డుగా నిలబడిన తల్లిని దారుణంగా హింసించారు. నిందితులను ఆకాశ్, గోపీ, బినేంద్ర, రాజేశ్ గా గుర్తించారు.

తన కూతుళ్లను వేధిస్తున్నందుకు ఎదురుతిరిగి ప్రశ్నించడంతో ఇంటికి వచ్చి సెవెతి దేవీ(55)అనే మహిళపై దాడి చేశారు. సోమవారం సాయంత్రం జరిగిన దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది.



హాస్పిటల్ కు తీసుకెళ్లేసరికి ఆమె చనిపోయినట్లు తేల్చేశారు. పోస్టుమార్టానికి మృతదేహాన్ని పంపించారు. నిందితులను పట్టుకునేందుకు వారి ఇళ్లపై దాడి జరిపారు పోలీసులు. వారంతా పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

Related Tags :

Related Posts :