దుర్గమ్మ పాదాల వద్ద తెగిపడిన జిన్ పింగ్ తల

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Mother Durga annihilated Asura ‘Xi Jinping’ చైనాపై ఉన్న వ్య‌తిరేక‌త‌ను ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లో వైవిధ్యంగా చూపించారు బెంగాల్ వాసులు. కొన్ని నెలలుగా సరిహద్దుల్లో భారత్-చైనా మధ్య యుద్ధవాతావరణం నెలకొన్న నేపథ్యంలో వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని ముర్షిదాబాద్ జిల్లాలోని బెర్హంపూర్‌ సిటీలో ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్టుగా దుర్గాదేవిని ప్ర‌తిష్టించారు. సర్గధమ్ సేవక్ సంఘ క్లబ్ ఈ విగ్రహాన్ని ప్రతిష్టించింది.అమ్మ‌వారి చేతిలో హ‌తమైన రాక్ష‌సుడి(అసుర) స్థానంలో ర‌క్తం క‌క్కుతున్న‌ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ బొమ్మ‌ను ఉంచారు. ఇది దుర్గా దేవి పాదాల కింద ఉంచారు. అమ్మ‌వారి వాహ‌న‌మైన సింహం దాని మొండాన్ని తినేస్టున్న‌ట్లుగా ఉంది. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే, సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవడంతో స్పందించిన సర్గధమ్ సేవక్ సంఘ క్లబ్ నిర్వాహకులు మాట్లాడుతూ…జిన్ పింగ్ ను ఉద్దేశించి తాము ఈ అసుర విగ్రహం పెట్టలేదని……మంగోలియన్స్ ని చూసి తాము ప్రేరేపితమయ్యామని తెలిపారు.

గతంలో కూడా తాము గ్రీకులను,ఆఫ్రికన్ల ద్వారా ప్రేపేపితమై అసుర విగ్రహాలను పెట్టినట్లు తెలిపారు. ఈ విగ్రహం వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశ్యం లేదా కారణం లేదని సృష్టం చేశారు. అంతేకాకుండా క్లబ్ అధికారులు ఈ థీమ్ విషయంలో జోక్యం చేసుకోలేదని… ఇది ఓ ఆర్టిస్ట్ ఐడియాద్వారా రూపకల్సన జరిగినట్లు చెప్పారు.

Related Tags :

Related Posts :