పెళ్లిలో అల్లుడ్ని చంకనెత్తుకుని అత్తగారు డ్యాన్స్..కూతుర్ని మాత్రం ఎత్తలేకపోయింది..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Variety Marriage Tradition In Westbengl : భారతదేశంలో జరిగే పెళ్లిళ్లు స్థానిక సంప్రదాయాలు..వధూవరుల కుటుంబాల సంప్రదాయాలను బట్టి జరుగుతుంటారు. అటువంటి కొన్ని సంప్రదాయాలు సరదాగాను..విచిత్రంగానూ ఉంటాయి. పశ్చిమబెంగాల్‌ లో జరిగిన ఓ పెళ్లిలో విచిత్రమైన సంప్రదాయంతో పెళ్లికొచ్చినవారినందరిని అలరించింది. ఈ పెళ్లిలో పెళ్లికొడుక్క తలపై కిరీటం ధరిస్తారు. పెళ్లికూతురుకి శఠగోపం మోడల్ లో ఉండే కిరీటం. ఇదీమీ విచిత్రం కాదు వింతాకాదు.


కానీ..ఈ పెళ్లిలో పెళ్లికొడుకుని కిరీటం ధరించిన అల్లుడిని అత్తగారు చక్కగా చంకన ఎత్తుకుని డ్యాన్స్ చేయాలి. ఇది కొంచెం కష్టంతో కూడుకున్నదే. కానీ ఈ అత్తగారు అలా ఏం ఫీలవ్వలేదు. చక్కగా చంటిపిల్లాడ్ని ఎత్తుకున్నట్లుగా అల్లుడ్ని ఎత్తేసుకుని స్టెప్పులు ఇరగదీసింది. ఏ సంప్రదాయం కోసం ఎత్తుకోవటం కాకుండా ఓ చంటిపిల్లాడ్ని ఎత్తుకున్నంత ఈజీగా అల్లుడ్ని ఎత్తుకుని డాన్సులేసింది. కాసేపు ఆ డ్యాన్స్ కొనసాగింది.


తరువాత అల్లుడ్ని దింపేసి కూతుర్ని ఎత్తుకుని డాన్స్ చేద్దామని కూతుర్ని ఎత్తుకోవటానికి ట్రై చేసింది కానీ సాధ్యం కాలేదు. అల్లుడిని అంతసేపు ఎత్తుకుని డ్యాన్స్ చేసింది కానీ.. కూతురిని మాత్రం ఎత్తుకోలేకపోయింది. ఆ సీన్ చూస్తేనే నవ్వు రావడం ఖాయం. పెళ్లికూతురు సిగ్గుపడిపోయింది.బహుశా పెళ్లికూతురి అలంకారం వల్ల ఆమెను ఎత్తుకోవడం కుదరకపోయి ఉండొచ్చు. ఈ వీడియోలో మరో కొత్త సంప్రదాయ పద్ధతి కూడా కనిపించింది.


అదేంటంటే..ఓ పెద్దావిడ ఒళ్లో పెళ్లికొడుకు కాసేపు కూర్చున్నాడు. కాసేపటికి లేచి ఆమె కాళ్లకు దణ్ణం పెట్టుకున్నాడు. తరువా పెళ్లికూతురు కూడా ఆ పెద్దావిడ ఒడిలో కూర్చుని లేచి ఆమెకూడా ఆవిడ కాళ్లకు దణ్ణం పెట్టకుంది.


బెంగాల్లో ఓ సంప్రదాయం ఉంది. పెళ్లి చేసి అమ్మాయిని పంపించేటప్పుడు ఓ రకమైన వంటకాన్ని రుచి చూస్తుంది. ఆ తర్వాత తల్లి ఒళ్లో కూర్చుంటుంది. అంటే, ఆ కుటుంబంతో తన రుణం తీరిపోయిందని దీని అర్థం అట.


5 నిమిషాలకు పైగా నిడివి ఉన్న ఈ వీడియోలో అత్తగారు, అల్లుడు కలసి చాలా సేపు స్టెప్పులు వేశారు. వారి స్టెప్పులకు ఇరుగుపొరుగు వారు కూడా డ్యాన్సులు చేశారు. మొత్తానికి పెళ్లి తప్పట్లు, తాళాలు, వేళాకోళాలు, డ్యాన్సుల మధ్య అందంగా..ముచ్చటగా జరిగింది.

Related Posts