లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story-2

అల్లుడిని 16సార్లు కత్తిపోట్లు పొడిచిన అత్త

Published

on

mother in law murders son in law: హైదరాబాద్ ఉప్పల్ లో దారుణం జరిగింది. ఓ అత్త తన అల్లుడిని హత్య చేసింది. అత్త అనిత అల్లుడు నవీన్ ను నిన్న(అక్టోబర్ 28,2020) రాత్రి కత్తితో పొడిచి చంపేసింది. రామంతపూర్ లోని కేసీఆర్ నగర్ లో ఈ ఘటన జరిగింది.కాగా, గతంలో అత్త అనిత అల్లుడు నవీన్ మధ్య వివాహేతర సంబంధం ఉంది. అయితే, అత్త అనిత అదే నవీన్ కు తన కూతురిని ఇచ్చి వివాహం చేసింది. నవీన్ వేధింపులతో పాటు తన తల్లితో ఉన్న వివాహేతర సంబంధం గురించి అనిత కూతురికి తెలిసింది. మనస్తాపం చెందిన అనిత కూతురు నాలుగు నెలల క్రితం ఆత్మహత్య చేసుకుంది. కూతురు ఆత్మహత్య తర్వాత కూడా అనిత, నవీన్ ల వివాహేతర సంబంధం కొనసాగింది. అయితే, గత రాత్రి నవీన్ ను అత్త అనిత దారుణంగా హత్య చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పెళ్లిలో అల్లుడ్ని చంకనెత్తుకుని అత్తగారు డ్యాన్స్..కూతుర్ని మాత్రం ఎత్తలేకపోయింది..
వివాహేతర సంబంధాలు మంచిది కాదని పోలీసులు నెత్తీనోరు బాదుకుని చెబుతున్నా కొందరిలో మార్పు రావడం లేదు. తమ సుఖం కోసం అడ్డదారి తొక్కుతున్నారు. అక్రమ సంబంధాల మోజులో కట్టుకున్న భర్తని, భార్యని, ఆఖరికి రక్తం పంచుకుని పుట్టిన పిల్లలను కూడా కడతేరుస్తున్నారు. అక్రమ సంబంధాల కారణంగా అనేక ఘోరాలు జరిగాయి. ఎంతోమంది కాపురాలు నాశనం అయ్యాయి. కటకటాల పాలయ్యారు. అయినా ఇంకా కొందరిలో మార్పు రావడం లేదు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *