కూతురు పెళ్లి కోసం డబ్బులు గుంతలో దాచిన దివ్యాంగ తల్లి : పాతనోట్లు చెల్లవని తెలిసి తల్లడిల్లిన అమాయకపు అమ్మ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కూతురు పెళ్లి కోసం ఓ అమ్మ రూపాయి రూపాయి కూడబెట్టింది. తన భర్త సంపాదించిన డబ్బులకు తోడు తానుపొడుపు చేసి దాచి పెట్టిన డబ్బులతో కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దామని ఆశపడింది. అలా కొంత డబ్బుని కూడబెట్టి ఎవరూ దోచుకుపోకుండా ఓ గుంతలో దాచి పెట్టింది. కానీ ఆ పిచ్చితల్లి కష్టపడి దాచిన కరెన్సీ నోట్లన్నీ చెల్లవని తెలిసి తెల్లబోయింది. తల్లడిల్లిపోయింది. ఇవన్నీ పనిచేయవా? మరి ఎలా? అంటూ అమాయకంగా చూస్తుండిపోయింది.

వివరాల్లోకి వెళితే..తమిళనాడులోని నాగపట్టణం జిల్లా శీర్గాళి సమీపం పట్టియమేడుకు చెందిన 52 ఏళ్ల ఉష దివ్యాంగురాలు. భర్త రాజాదురైతో పాటు తానుకూడా కష్టపడి పనిచేస్తే ఎక్కువ డబ్బులు కూడబెట్టవచ్చు కదా అనుకునని ఊళ్లో ఉపాధి పనులకు వెళ్తూ తన కూతురు విమల పెళ్లి కోసమని డబ్బులు కూడబెట్టింది. విమల బధిరురాలు. తాము ఇద్దరూ పనులను వెళ్లిపోతాం. పొద్దున్న వెళితే సాయంత్రం గాని తిరిగిరాం. మరి ఆ డబ్బుల్ని ఎవరన్నా దోచుకుపోతారనే భయంతో వాటిని ఇంటి వెనుక ఓ గుంత తవ్వి అందులో దాచిపెట్టింది. అవన్నీ రూ.500, రూ.1,000 నోట్లే.
ఈ క్రమంలో ఇటీవల రాజాదురైకు ప్రభుత్వం ఇల్లు మంజూరు చేసింది. దీంతో ఆమె భర్త రాజా దురై ఇంటికి కుంతలు తీస్తుండగా..ఆ డబ్బుల బ్యాగు బయటపడింది. అందులో రూ.1,000 నోట్లు, రూ.500 నోట్లు కలిపి సుమారు రూ.35వేలు రాజాదురై షాక్ అయ్యాడు. వెంటనే భార్య ఉషను కేకేసి డబ్బుల బ్యాగుకు చూపించాడు.

దానికి ఆమె అమాయకంగా మన కూతురు పెళ్లి కోసం ఆ డబ్బుల్నినేనే దాచాను అని చెప్పింది. దీంతో రాజాదురైకు దిమ్మతిరిగిపోయింది. ఓసి నా పిచ్చి పెళ్లామా? నాలుగేళ్ల క్రితమే ఈ నోట్లు చెల్లవని ప్రభుత్వం ప్రకటించిందని భార్యతో చెప్పాడు. దీంతో పాపం ఉష బిత్తరపోయింది. ఈ విషయం నాకు తెలీదు..నాకెవరూ చెప్పలేదు..నువ్వు కూడా చెప్పలేదు కదా?..అంటూ అమాయకంగా బదులిచ్చిది.

దివ్యాంగురాలైనా సరే ఇంటి కోసం కష్టపడుతున్న భార్యను చూసి ఆనందించాలో..కష్టపడి దాచిన డబ్బులు చెల్లవని బాధపడాలో తెలీక బాధగా భార్యవంక చూస్తుండిపోయాడు భర్త రాజాదురై.ఈ విషయం తెలిసిన చుట్టుపక్కలనవారు అమాకంగా ఉష చేసిన పనికి ఫలితం లేకుండా పోయిందని బాధపడ్డారు. దివ్యాంగురాలైన ఆమె కష్టాన్ని అర్థం చేసుకుని ప్రభుత్వం సహాయం చేయాలని కోరుతున్నారు.

Related Posts