Home » వికారాబాద్ లో పొంగిపొర్లిన వాగు..పిల్లల కోసం తల్లి ప్రాణత్యాగం
Published
4 months agoon
By
madhuవాగులో కొట్టుకపోతున్న పిల్లలను రక్షించేందుకు ఓ తల్లి సాహసమే చేసింది. వారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించింది. ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. మర్పల్లి మండల పరిధి షాపూర్ తండాలో దశరథ్, అనితా బాయి (35) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఐదుగురు సంతానం.
పత్తి చేనులో కలుపు తీసేందుకు ఇంటిల్లిదితో పాటు..మరో ముగ్గురు ఆటోలో వెళ్లారు. సాయంత్రం నాలుగు గంటల సమయలో తిరిగి ఇంటికి బయలుదేరారు. ఈ సమయంలో భారీ వర్షం కురుస్తోంది. మార్గమధ్యంలో వాగు భారీగా ప్రవహిస్తోంది. ఇంటికి వెళ్లాలనే తొందరలో దశరథ్, అనితా బాయి..ముగ్గురు పిల్లలను అతికష్టం మీద ఒడ్డుకు చేర్చారు.
11, 14 సంవత్సరాలున్న కుమార్తెలు బబ్లూ, వీణా బాయిలను అనితా బాయి దాటిస్తోంది. వాగు ప్రవాహానికి తల్లి కాలు పట్టు తప్పింది. పిల్లలు వాగులో కొట్టుకపోతున్నారు. కుమార్తెలను రక్షించేందుకు శతవిధాలుగా ప్రయత్నించింది. పిల్లలు మరో వైపుకు దూసుకెళ్లారు. అక్కడనే ఉన్న భర్త..వారిని రక్షించాడు.
పెళ్లి అయి మూడు రోజులే..భార్య విడిచి వెళ్లిందని యువకుడు ఉరేసుకున్నాడు
కానీ అనితా బాయి కొట్టుకపోయింది. కళ్లెదుటే భార్య కొట్టుకపోతుండడంతో భర్త..ఏమి చేయలేకపోయాడు. సుమారు 200 మీటర్ల దూరంలో అనిత డెడ్ బాడీ లభ్యమైంది. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.